ప్రెస్ నోట్ ఆధారత వార్తలు
హిందు 9 న్యూస్ |20/3/2026:

______పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసాం పండగను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలి, జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,
జిల్లా ముస్లిం ప్రజలందరికీ రంజాన్ పండుగ సందర్భంగా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుతున్నానని పండగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లను పోలీస్ శాఖ చేసిందని ప్రశాంతమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా వెల్లడించారు….
వికారాబాద్ జిల్లా : శనివారం రోజు జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా ముస్లిం మైనార్టీలకు, ఈ ముబారక్(శుభాకాంక్షలు) తెలుపుతున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా ప్రకటించారు. క్రమశిక్షణ దానగుణం సహనానికి ప్రతీకగా నిలిచే పవిత్ర మాసమే రంజాన్ అని ఈ రంజాన్ పండుగను ముస్లిం మైనార్టీ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
నెల రోజులపాటు అత్యంత నిశిష్ఠతో ఉపవాస దీక్షలు విరమించి జరుపుకునే ఈ వేడుక చాలా శుభ పరిణామం అని ఆమె కొనియాడారు. ఈ పండుగ ప్రజలందరి జీవితాలలో సుఖశాంతులు ఆయురారోగ్యాలు నింపాలని కోరారు.

ఈ పండుగ సమాజంలో మత సామరస్యానికి సోదర భావాన్ని పెంపొందించే విధంగా పండగలు జరుపుకోవాలని ఆమె ఆశ భావం వ్యక్తం చేశారు.

పండుగ సందర్భంగా శాంతిభద్రతల అదృష్ట జిల్లాలో పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేసిందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ పండుగను జరుపుకోవాలని తెలిపారు.
