అభివృద్ధి ,
K Yadaiah September 6,2025


అంబేద్కర్ భవన్ పూర్తి అయ్యేదిఎప్పుడు దళితులకు అంబేద్కర్ భవన్ ను అప్ప చెప్పేది ఎన్నడో అర్థం కావడం లేదని నిధులు ఉన్న ఇప్పటికి నిర్మాణానికి యాలాల్ అంబేద్కర్ భవన్ ఎందుకు నోచుకోవడం లేదో తెలియడం లేదని అసహనాన్ని వ్యక్తం చేశాయి……
హిందు 9 న్యూస్ /యాలాల్ : యాలాల మండల కేంద్రంలో 2022లో గత ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ భవానికి శంకుస్థాపన చేశారని దాదాపుగా మూడు సంవత్సరాలుగా వస్తున్న ఇప్పటికీ అంబేద్కర్ భవనం పూర్తి కాకపోవడం వివక్షత చూపడమే అవుతుందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్య దర్శి ఉప్పల్ మలకయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ సంక్షేమ శాఖ నుండి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు అయితే ఇప్పటివరకు కనీసం పనులు జరగకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని తెలిపారు. తాండూర్ నియోజకవర్గంలో అంబేద్కర్ భవన్ కు కోటి రూపాయలతో మంజూరైనట్లు ఆనాడు ప్రభుత్వాలు ప్రకటించాయని !అక్కడ కూడా నియోజకవర్గ అంబేద్కర్ భవన్ పూర్తి కాలేదని ఇది దళితులు నిన్న జాతులు ఎలా అర్థం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. యాలాల మండల కేంద్రానికి మంజూరైన అంబేద్కర్ భవన్ శిలాఫలకం శంకుస్థాపనాల వరకే మిగిలిపోయిందని శిలాఫలకం వరకే కాకుండా కాకుండా తక్షణమే నిర్మాణ పనులు చేపట్టి దళితుల సంక్షేమనికి తోడుపాటు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మండల కేంద్రంలో సర్వేనెంబర్ 220 విస్తీర్ణం 1: 5 గుంటల అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించిందని ప్రస్తుత శాసనసభ్యులు దీని మీద తగిన చర్యలు తీసుకొని త్వరితగతిన అంబేద్కర్ భవనం పూర్తి అయ్యే విధంగా చూడాలని వారి కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లక్ష్మప్ప నరసింహులు సంద గళ్ళ శ్రీనివాస్ జోగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
