ముఖ్యాంశాలు
Kura yadaiah February, 5,2026,
హిందు 9న్యూస్ బ్యూరో :


-తాండూర్ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన పైలెట్ రోహిత్ రెడ్డి,
-36 వార్డుల్లో ముమ్మర ప్రచారం, ప్రజలు మా వైపునే ఉన్నారు, ప్రజల ఆధరణతోనే మున్సిపల్ ఎన్నికల్లో గెలవబోతున్నాం,
-అరాచకాలు మాఫియా బెదిరింపులు మీవి!, మాది అభివృద్ధి పాలన,
-తాండూర్ ప్రజలు కారు గుర్తుకు తమ అమూల్యమైన ఓటును వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి, తాండూర్ అభివృద్ధిలో భాగస్వామ్యం కండి, పైలెట్ రోహిత్ రెడ్డి,
Ex MLA Rohit Reddy|తాండూర్ ప్రజలకు మేనిఫెస్టో ద్వారా ప్రజా సంక్షేమం అభివృద్ధిని అందిస్తామని చక్కటి మేనిఫెస్టో ద్వారా ప్రజలకు పాలన అందిస్తామని చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు నేతృత్వంలో తాండూర్ ను అభివృద్ధి దిశలో నడిపిస్తామని పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు…..
హిందు 9న్యూస్ (తాండూర్ 5;)మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ప్రజా సంక్షేమం అందిస్తామని చక్కటి పరిపాలన అందిస్తామని ప్రజల ఆదరణ తోనే బిఆర్ఎస్ తాండూర్ మున్సిపల్ లో గెలుపు తత్వమని తాండూర్ మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ నేత పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం రోజు తన క్యాంపు కార్యాలయంలో తాండూర్ మున్సిపల్ మేనిఫెస్టోను టిఆర్ఎస్ నేతలతో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ప్రజా సంక్షేమం అందిస్తామని చక్కటి పాలన తప్పకుండా మేనిఫెస్టోను అమలు పరిస్థితి అభివృద్ధిని అందిస్తామని గ్యారెంటీ హామీగా ప్రజల ముందు పెడుతున్నామని రోహిత్ రెడ్డి అన్నారు. ఆశ పెట్టడం గాని ఆకాశానికి నిచ్చెనవేయం కోట్ల హామీలు ఇవ్వబోము సేవకులుగా ఉంటామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తాండూర్ లో అరాచకాలు, మాఫియా, బెదిరింపుల రాజకీయాలు !నడుస్తున్నాయని గతంలోనే తాండూర్‌ను కోటి రూపాయల నిధులతో అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభుత్వం గతంలో విద్యాభివృద్ధికి పెద్ద పీట వేసిందని ఆ రకంగానే తాండూరులో అనేక గురుకుల పాఠశాలలను నిర్మించామని తద్వారా పేదల పిల్లలందరూ కూడా ఈరోజు విద్యను అభ్యసించడానికి ముఖ్య కారణం ఆనాటి ప్రభుత్వమని ఆయన అన్నారు. చిలక వాగు అభివృద్ధి గాని, వాటితో పాటు తాండూర్ లో సిసి రోడ్లు డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులను గత ప్రభుత్వంలోనే చేసి చూపించామని ఆ పనులను ఇప్పుడు ప్రజలు గుర్తిస్తు మమ్మల్ని ఆదరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకెళుతున్నామని ప్రజా సంక్షేమం కోసం తాండూర్ అభివృద్ధే ధ్యేయంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున తాండూరులో మేనిఫెస్టో ద్వారా స్వచ్ఛమైన నీతివంతమైన పాలనను అందించడానికి బిఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు నాయకత్వంలో ప్రజా సమస్యల కోసం ప్రతి సోమవారం ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తామని రోహిత్ రెడ్డి తెలిపారు. రోడ్ల శుభ్రత పారిశుద్ధ్య నిర్వహణకు విశేష ప్రాధాన్యం ఇవ్వడానికి సిద్ధమయ్యామని పార్కుల నిర్వాణలో కాలనీలు వివాసుల భాగస్వామ్యం కూడా తీసుకుంటామని అన్నారు. ప్రతి ఆరు మాసాలకు ఒకసారి చైర్మన్ మరియు కౌన్సిలర్ల పనితరుపై కూడా నివేదిక విడుదల చేస్తామని స్పష్టం చేశారు. పాలన పారదర్శక జవాబుదారి పాలనకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు.

ఇలాంటి నూతన పద్ధతుల ద్వారా ప్రజల ముందుకు వెళుతున్నామని ప్రజలు కూడా కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ ను అధికారంలోకి ప్రజలు సిద్ధమైనట్లు తెలుస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నెలకొకసారి సమీక్షలతో తో పాటు కాలనీలలో ప్రజల భాగస్వామ్యం చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడానికి మిషన్ భగీరథ పేరుతో కెసిఆర్ ప్రభుత్వంలో ప్రజలకు మంచినీటిని అందించామని ఇప్పుడు అదే మంచి నీటిలో మురుగు నీరు కూడా ప్రవహిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు.
ప్రతి వార్డులో మినరల్ వాటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని ఇప్పటివరకు ఆ ఉద్యోగాల పరిస్థితి ఏమైందో ఎవరికి కూడా అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.
గత ప్రభుత్వం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా పట్టణంలో పచ్చదనాన్ని పెంచిందని ప్రస్తుతం పర్యావరణాన్ని పచ్చదనాన్ని పెంచడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. తప్పకుండా వార్డుల వారీగా గ్రీన్ కార్డును ఏర్పాటు చేసుకొని పచ్చదనానికి తప్పకుండా ప్రాధాన్యతను ఇస్తామని ఆయన తెలిపారు.
తాండూరుకు అనేకమంది బతుకుతెరువు నిమిత్తం కూలి పనుల కోసం ఎంతోమంది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పనుల కోసం వస్తారని వారి ఆకలి తీర్చడానికి తాండూర్‌లో పేదల ఆకలి తీర్చడానికి అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా పేదలకు కూలీలకు సకల ప్రజలందరికీ 10 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ సమస్య తాండూర్ లో ప్రధాన సమస్యగా మారిందని గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశామని, అవి ఇప్పుడు పని చేస్తున్నాయో లేదో తెలవదని ట్రాఫిక్ పరిష్కారం కోసం పోలీస్ శాఖ సమన్వయంతో తప్పకుండా ట్రాఫిక్ సమస్యను కూడా నియంత్రించడానికి కృషి చేస్తామని అన్నారు. పట్టణంలో కుక్కల బెడద నుండి కూడా ప్రజలను ముఖ్యంగా పిల్లలను కాపాడడానికి ప్రాముఖ్యతను ఇస్తామని పేర్కొన్నారు. తాండూర్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు నేతృత్వంలో తాండూర్ ను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ను మేము కోల్పోయామని ప్రజలు అనుకుంటున్నారని మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని ప్రజల్లో ఒక స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని తాండూర్ ప్రజలు కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.
బిఆర్ఎస్ ఇచ్చిన మేనిఫెస్టోకు కట్టుబడి తాండూరును అభివృద్ధి చేసుకోవడంలో భాగస్వామ్యం కావాలని రోహిత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపీ మరియు ఎమ్మెల్యే సహకారం తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా తాండూరు ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మకుండా కారు గుర్తుపై ఓటు బిఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ మీడియా అధికార ప్రతినిధి తాండూర్ మున్సిపల్ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్ బిఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి ఇర్ఫాన్ మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ లతో పాటు బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
