ముఖ్యాంశాలు
Kura Yadaiah/ February 2026,
హిందు 9 న్యూస్ :

తాండూర్ మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి తో కలిసి రోగుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు….
హిందు 9 న్యూస్( తాండూర్ 20): తాండూర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి సంయుక్తంగా సందర్శించి రోగుల బాగోవులను తెలుసుకున్నారు.

శుక్రవారం రోజు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ రాజీవ్ గృహకల్ప నందుగల మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఆస్పత్రిలో ఉన్న మౌలిక వసతులతో పాటు వివిధ సదుపాయాలు ఆరోగ్య సిబ్బంది సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ సుధీ మున్సిపల్ చైర్మన్ నీరజా బాల్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, డి సి హెచ్ ఎస్ ఆనంద్ సూపర్ ఇండెంట్ డాక్టర్ వినయ్ కుమార్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
