ముఖ్యాంశాలు
Kura yadaiah| February 5,2026,
హిందు 9న్యూస్ బ్యూరో :-


-మీ ఆదర అభిమానాలే నాకు శ్రీరామరక్ష,
-23వ వార్డులో గత ప్రభుత్వంలో నేను చేసిన పనులే,
-వార్డులో విద్య వైద్య మరియు అభివృద్ధికి కృషి చేద్దాం,
-మళ్లీ అవకాశం ఇవ్వండి వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుకుందాం,
BRS counsellor candidate G, parimala| మీ ఆదరాభిమానాలే, నాకు శ్రీరామరక్ష అని గతంలో మీ సపోర్టు వల్ల మీ త్యాగం మీ ప్రేమ మీ అభిమానం వల్ల కౌన్సిలర్గా నిలబెట్టాయని ఇప్పుడు కూడా మీ సపోర్టుతోనే కౌన్సిలర్ గా పోటీ చేస్తూ 23వ వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకొని ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుకుందామని టిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి గడ్డల పరిమళా రవీందర్ ప్రకటించారు…..
హిందు 9న్యూస్ (తాండూర్ 5;) మీ ఆదరాభిమానాలు నన్ను గతంలో కౌన్సిలర్ గా నిలబెట్టాయని ఇప్పుడు కూడా మీ అభిమానం మీ ప్రేమ మీ త్యాగం వల్లనే మళ్లీ నేను పోటీలో నిలబడుతున్నానని మీ సపోర్టు తోని 23వ వార్డును గతంలో అనేక రకాలుగా అభివృద్ధి చేశానని 23, టిఆర్ఎస్ అభ్యర్థి గడ్డల పరిమళ రవీందర్ అన్నారు. ఇప్పుడు కూడా మీ సపోర్టుతో మళ్లీ నాకు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం దక్కిందని వార్డు ప్రజల ఆశీస్సులు ఆదరణ నాకు ఉండాలని అలాగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మళ్ళీ వార్డు అభివృద్ధికి మీరంతా భాగస్వామ్యం కావాలని మీ భాగస్వామ్యం ఉంటేనే వార్డును మరింత అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకెళ్దాం 23వ వార్డులో గురువారం రోజు జరిగిన ఇంటింటి ప్రచారంలో ప్రచార జోరును పెంచారు.

–గత ప్రభుత్వంలోనే వార్డులో నేను చేసిన పనులే,
గత ప్రభుత్వం, రోహిత్ రెడ్డి నాయకత్వంలోనే వార్డు సమస్యలను పరిష్కారం చేసుకున్నామని మరోసారి వార్డును అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలందరూ సహకరించాలని అభివృద్ధికి దోహదపడాలని ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలను కోరారు.
ఇప్పటికీ వార్డులో గత ప్రభుత్వంలో నేను చేసిన పనులు తప్ప మరేవీ లేవని మళ్లీ నన్ను గెలిపిస్తే తప్పకుండా 23వ వార్డును ప్రగతి పథంలో నడుపుకుందామని పచ్చదనంతో పాటు పారిశుభ్రత మురుగు కాలువల శుభ్రత సిసి రోడ్ల నిర్మాణం ప్రజా సంక్షేమం ఇలా అనేక రకాలుగా అభివృద్ధి చేసుకోవాలంటే బి ఆర్ ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. అనేక సంవత్సరాలుగా రాజకీయాలలో ఉంటూ క్రియాశీల కార్యకర్తగా వార్డు ప్రజలకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించానని ఇప్పుడు కూడా ప్రజలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించడానికి ముందుంటానని ఆమె తెలిపారు.
–నిరుపేద పిల్లల విద్య అభివృద్ధికి దోహద పడదాం రండి, నన్ను గెలిపించండి,
వార్డులో నిరుపేద పిల్లలకు సంవత్సరానికి సరిపడ్డ పుస్తకాలు నోట్బుక్లను ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించానని ఆమె తెలిపారు. మూడు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపులు నిరుపేద కుటుంబంలో ఆడ సంతానం కలిగితే 25 వేల రూపాయలు అలాగే నిరుపేద ఇంటిలో ఆడపిల్ల కట్నంగా 11 వేల రూపాయలు ఇవ్వాలని, వార్డులో ఉన్న మహిళల గురించి డ్వాక్రా భవనం కూడా నిర్మించాలని తలపించామని ఆమె స్పష్టం చేశారు. ఇలా అనేక రకాలుగా వార్డును అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకు వెళ్దామని ప్రజలను కోరారు.

-ఆడపిల్లల సమస్యలకు అండగా నిలబడతా నాకు ఓటేసి గెలిపించుకోండి, పరిమళ రవీందర్,
ముఖ్యంగా ఆడపిల్లల సమస్యల పరిష్కారం వారి సంక్షేమం మహిళా సంక్షేమం యువత సంక్షేమంపై దృష్టి పెడతామని ఆమె హామీ ఇచ్చారు. తప్పకుండా ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో తాండూర్ మండల్ మాజీ వైస్ ఎంపీపీ రాజప్ప గౌడ్ షబీర్ వెంకటేశం సంగప్ప రాజు ప్రశాంత్ దస్తప్ప నాగేష్ యాదయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
