మెరికల్ లాంటి అభ్యర్థులను ఎంపిక చేశాం, తాండూర్ మున్సిపాలిటీలో 30 స్థానాల్లో గెలుపు తథ్యం, బల్దియ పీఠం మాదే, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,

ముఖ్యాంశాలు 

Kura Yadaiah| January 30,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో :

Municipal election| తాండూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మెరికల్ లాంటి అభ్యర్థులను ఎంపిక చేశామని 30 స్థానాలలో గెలుపు మాదేనని తప్పకుండా తాండూర్ బల్దియాపీఠం కైవసం చేసుకొని తీరుతామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు….

హిందు 9 న్యూస్( తాండూర్) : రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారంగా నేటితో రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియ పూర్తికాగా తాండూర్ మున్సిపాలిటీలో కూడా నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది. ఈ ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మెరికల్ లాంటి అభ్యర్థులను ఎంపిక చేసిందని, 30, స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని బల్లియపీఠం, దక్కించుకుంటుందని తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తాండూర్ మున్సిపాలిటీలో జెండా ఎగరవేస్తం,

అంకితభావంతో శ్రమ ప్రజాసేవ చేయాలనుకుని వాళ్లను సామాజిక కోణాలలో శోధించి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి వచ్చిందని ఆ కోణంలోనే అభ్యర్థులను ఎన్నిక చేసామని కాంగ్రెస్ పార్టీ తాండూరు మునిసిపాలిటీలో జెండా ఎగరవేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. తాండూర్ ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఇంకా తాండూర్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామని తప్పకుండా తాండూరును అభివృద్ధి దిశలో నడపడానికి కృషి చేయాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాల్సిన అవసరం ఉందని కోరారు.

కాంగ్రెస్ పార్టీ ఏకైక ఏ జెండా తాండూర్ను అభివృద్ధి దిశలో నడిపించడమేనని ఎన్ని అడ్డంకులు వచ్చినా తాండూర్ను మంచి పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *