ఆధ్యాత్మికం,
Kura Yadaiah| January 30,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :

P, Mahendra Reddy / ఖాజాపూర్ గ్రామంలో నిర్మించ తలపెట్టిన మైసమ్మ గుడి పున నిర్మాణ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆ గ్రామము పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు…..
హిందు 9 న్యూస్ ( తాండూర్ ):-తాండూర్ మండల్ ఖాంజాపూర్ గ్రామంలో మైసమ్మ దేవాలయం పునర్నిర్మానం చేపట్టాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ఈ పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి గ్రామస్తుల ఆహ్వానం మేరకు శుక్రవారం రోజు తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డిని ముఖ్య అతిథిగా విచ్చేసి మైసమ్మ దేవాలయ భూమి పూజ కార్యక్రమాన్ని చేశారు.
ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి,
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు.

భూమి పూజకు వచ్చిన మహేందర్ రెడ్డిని స్థానిక నాయకులు శాలువాతో సత్కరించి సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో టిపిసిసి ప్రచార కార్యదర్శి కరణం పురుషోత్తమరావు రాజేశ్వర్ రెడ్డి ఉపసర్పంచ్ చేమలత వీరేశం చంద్రశేఖర్ శివకుమార్ సర్పంచ్ రామరెడ్డి వెంకటయ్య వీరేశం గ్రామ ప్రజలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
