బిసి సమాజమే ఈ దేశానికి వెన్న ముక్క, స్వాతంత్ర వేడుకల్లో, బీసీ సంఘం నేత కందుకూరి రాజ్ కుమార్,

స్వాతంత్రం,

హిందు 9 న్యూస్,

K, Yadaiah|August 15,2025,

*బీసీ సమాజమే ఈ దేశానికి వెన్నుముక,
*స్వాతంత్రం వచ్చి 79 ఏండ్లు గడిచిన సామాజిక సమానత్వం లేదు,
*స్వతంత్ర ఫలాలో వెనుకబడి ఉన్నారు,
*బీసీలు అభివృద్ధి బాటలో ఎదగాలంటే బిసి రిజర్వేషన్ ఏకైక మార్గం,

independence day|తాండూర్ :    బీసీ సమాజం ఈ దేశానికి వెన్నుముక లాంటిదని స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు గడిచిన బీసీలు ఇంకా ఈ దేశంలో వెనుకబడి ఉన్నారని స్వాతంత్ర ఫలాలు అందడంలో కూడా బీసీలు వెనుకబడే ఉన్నారని వీటన్నిటికీ పరిష్కార మార్గం బీసీ రిజర్వేషన్ పెంచడమే ఏకైక మార్గమని, అప్పుడే రాజకీయంగా విద్యా ఉద్యోగాలలో బీసీలు అభివృద్ధి దిశగా అడుగు పడతాయని, 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూర్ సర్దార్ పటేల్ చౌక్ నందు బీసీ సంఘం మరియు సర్దార్ పటేల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంఘం నేత కందుకూరి రాజ్ కుమార్  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఈ సందర్భంగా అన్నారు.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను స్మరించుకుంటూ వారి త్యాగాలను గుండెల్లో పదిలంగా దాచుకుంటూ దేశ ప్రజలకు తాండూరు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రాజకుమార్ అన్నారు. స్వాతంత్రం కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు సామాజిక సమానత్వం ఆర్థిక న్యాయం భారతదేశంలో ఇంకా వెనుకబడి ఉన్న బీసీ ఆర్థిక సామాజిక విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆయన గుర్తు చేశారు.

బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే 42 శాతం రిజర్వేషన్లు అమలుపరచాల్సిందేనని రాజ్ కుమార్ పేర్కొన్నారు. వ్యవసాయం కులవృత్తులు కలలు వాణిజ్యం ఇవన్నీ బీసీల శక్తితోనే బలపడుతున్నాయని గుర్తు చేశారు. స్వాతంత్రము వచ్చి 79 ఏళ్లు గడిచిపోయిన సామాజిక సమానత్వం సామాజిక న్యాయం ఇంకా సాధించలేకపోయామని అభిప్రాయపడ్డారు. బీసీలు ఈ దేశంలో బలపడితేనే దేశం బలపడుతుందని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీసీ సమాజం కూడా ఐక్యంగా కలిసి ముందుకు సాగి రాబోవు తరాల కోసం బలమైన పునాదులు వేయాలని రాజకుమార్ బీసీలకు పిలుపునిచ్చారు.

రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్  జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ మహిళా నాయకురాళ్లు నరసమ్మ మంజుల జగదీశ్వరి సర్దార్ పటేల్ అసోసియేషన్ సభ్యులు జైసపు లింగం రమేష్ అజయ్ రాయల్ రాజు బజరంగ్దళ్ నాయకులు రజిని , అరుణ్ రాజ్, నాగేందర్ బీసీ సంఘం యువ నాయకుడు బసవరాజు రాము ,వెంకట్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *