66 పాలసీలతో అర్థ సెంచరీ -అత్యుత్తమ పురస్కారం అందుకున్న కంపిల్ల సంతోష్, అంపల్లి సంతోష్,

బిజినెస్, అవార్డు,

Kura Yadaiah| November 23,2025,

హిందు 9 న్యూస్ బ్యూరో :-

 Award|  66 పాలసీలతో అర్థసించేరీ పూర్తి చేసి ఎల్ఐసి సంస్థ నుండి అత్యుత్తమ పురస్కార అవార్డులను కం పిల్ల సంతోష్, అంపల్లి సంతోష్ లు అందుకని నమ్ముకున్న సంస్థకు ఇటు ప్రజల జీవిత భద్రతకు భరోసాను కల్పించారు……

Award|తాండూర్ :-  నేటి సమకాలిన సమాజంలో  రోజురోజుకు మనిషి బ్రతుకుకూ భద్రత కరువవుతున్న సందర్భాలను ప్రతిరోజు చూస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు అనో  అగ్ని ప్రమాదాలు అనో అనుకోకుండా విద్యుత్ ప్రమాదాలు రకరకాల ప్రమాదాలలో మానవ జీవితం మనగడ సాధించడం అంత ఈజీ  ఏమీ కాదు మారుతున్న సమాజాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది . మనం సురక్షితమైన ప్రయాణం చేసిన ఎదుటి నుండి వస్తున్న వాహనాలు సరియైన మార్గాలలో  రావచ్చు రాకపోవచ్చు  నమ్మకం అయితే లేకుండా పోతున్నది.

జీవిత బీమా మనిషి భద్రతకు మంచిదే,

ఇలాంటి సందర్భంలోనే మనిషికి జీవిత బీమా అనే భద్రత అతి ముఖ్యమైనది. ఎందుకంటే వారిని నమ్ముకొని కుటుంబంలో ఉన్న పెద్దలనుండి పిల్లల వరకు ఆధారపడి జీవిస్తున్న వాళ్లే, సమకాలీన నేటి సమాజంలో  జీవిత బీమా భద్రత( ఎల్ఐసి) లాంటి పాలసీలు అతి ముఖ్యమైనవి. చివరికి ఆ వ్యక్తి అనుకోని ప్రమాదాలలో మరణించిన తనను నమ్ముకొని జీవిస్తున్న తన కుటుంబం ఏ ఆధారం లేకుండా ఉండకూడదని ఉద్దేశం తోనైనా జీవిత బీమా పథకాలు ఆ కుటుంబాన్ని కాస్త కూసో ఆదుకోవడానికి పనికి వస్తాయి.

అవార్డులు అందుకున్న, కంపిల్ల సంతోష్, అంపల్లి సంతోష్,

జీవిత బీమా లాంటి పథకాలు ఇప్పుడు అత్యవసరమే అవసరం కూడా ప్రతి మనిషి చేసుకోవాల్సిన అవసరమే, అలాంటివి జీవిత బీమా భద్రత కల్పిస్తూ ఏజెంట్లుగా పని చేస్తున్న వారిలో  వికారాబాద్ జిల్లా కులక్చర్ల రాంనగర్ గ్రామానికి చెందిన కంపెనీల సంతోష్ 2025 ఆర్థిక సంవత్సరానికి గాను 65 పాలసీలను చేసి అర్థసెంచరి పూర్తి చేశారు.  అర్థ సెంచరీ పూర్తి చేసిన  సందర్భంగా శనివారం  తాండూర్ లో జరిగిన  యూనిట్ మీటింగ్ సమావేశంలో ప్రతిభను కనబరిచిన ఏజెంట్లకు ఎల్ఐసి డివో నరేష్   సంతోష్ ను సన్మానించి అవార్డును అందజేశారు. అదేవిధంగా గత అక్టోబర్ నెలలో అధిక పాలసీలు సాధించి తాండూరుకు చెందిన అంపల్లి సంతోష్ కూడా ఈ అవార్డును అందుకున్న వారిలో ఉన్నారు. యూనిట్  స్థిరంగా పనిచేసే విధంగా పనితనాన్ని కనపరుస్తూ తమ ప్రతిభను కనబరుస్తూ పేరును సంపాదించిన ఉమేష్ సురేందర్ లను కూడా యూనిట్స్ సన్మానించింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా రిపోర్టర్ గయాస్ యూనిట్ లోని పలువురు ఏజెంట్లు పాల్గొని తమ సందేశాలను అందించారు. అందులో భాగంగానే యూనిట్ బలం అంటే ఏజెంట్ల సేవా దృఢ సంకల్పం నమ్మకం శ్రమతో కూడి పని చేసే విధానం ఉండాలని ఆ రకంగా కనబరిచిన ఏజెంట్లకు సన్మాన గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని డివో నరేష్ తెలిపారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *