పవిత్ర పుణ్యక్షేత్రంలో అస్థిపంజరం కలకలం.. మిస్టరీ చేధించే పనిలో పోలీసులు

దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కర్ణాటకలో అత్యంత పవిత్రమైన, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో *ధర్మస్థల* ఒకటి. ఇక్కడ ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం వస్తుంటారు. అయితే, గత కొద్ది కాలంగా ఈ ఆధ్యాత్మిక క్షేత్రం అనుమానాస్పద మరణాలు, అదృశ్యాలు, ఆత్మహత్యల కేసులతో వార్తల్లో నిలుస్తోంది. ఇది భక్తులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో, ఇలాంటి ఘటనలు పెరగడం నిజంగా మిస్టరీని పెంచుతోంది.

తాజాగా శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చి పెట్టానని ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ చోట గురువారం కొన్ని అవశేషాలను గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం. పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు నేపథ్యంలో ఈ అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గత సోమవారం నుంచి సిట్‌ అధికారులు.. అతడిని వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టారు

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *