ప్రభుత్వం , సంక్షేమం ,
Kura Yadaiah (చీఫ్ ఎడిటర్ )September 19,2025,


- సంక్షేమ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్,
- వనరుల పట్ల కార్యాచరణ ప్రణాళికలు, నివేదికలను రాష్ట్ర ముఖ్యమంత్రి కి అదే విధంగా నివేదిక తయారు చేయాలని ఆదేశించిన మంత్రి,
సంక్షేమ శాఖలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గురువారం రోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు………
హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో గురువారం రోజు వివిధ సంక్షేమ శాఖలపై సంక్షేమ పథకాలతో అధికారులతో సాక్షి సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో గిరిజన సంక్షేమ ఎస్సీ సంక్షేమ మైనార్టీ సంక్షేమ దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ ల చైర్మన్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమీక్షలు పలు అంశాల పైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య సౌకర్యాల కల్పన బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు పలు అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. దివ్యాంగ విద్యార్థులు ట్రాంజెండర్స్ లబ్ధిదారులకు తగిన సౌకర్యాలు మరియు మద్దతు అందించడానికి అన్ని కార్యక్రమాన్ని ప్రణాళికలను విధివిధానాలను దిశ నిర్దేశం చేశారు.
సంక్షేమ కార్యక్రమాలలో పారదర్శకత మరియు జవాబుదారీతనం పెంపొందించడానికి డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలు మరియు ఆన్లైన్ ఫిర్యాదుల పరిష్కారం వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని అధికారులకు సూచించారు. అదనపునిధుల కోసం వనరుల అవసరాలతో పాటు సూచనలను ఏకీకృతం చేసి వీలైనంత త్వరగా రాష్ట్ర ముఖ్యమంత్రి కి కార్యాచరణ ప్రణాళిక నివేదికను ఆయా శాఖలు సమర్పించాలని కోరారు.కాల అనుగుణంగా నివేదించడానికి అన్ని విభాగాల సమన్వయంతో పని చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీమతి అనితా రామచంద్రన్ ఐఏఎస్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ) బి శైలజ దివ్యాంగులు వయోవృద్ధుల ట్రాంజెండర్స్ సాధికారత శాఖ సంచాలకులు. కార్పొరేషన్ చైర్మన్లు బెల్లయ్య నాయక్ ముత్తినేని వీరయ్య అన్ని శాఖల ముఖ్య ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
