మా గ్రామ అభివృద్ధికి మీ తోడుపాటును అందించండి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మంబాపూర్ పంచాయతీ వార్డు సభ్యుల వినతి,

ప్రగతి వార్తలు,

హిందు 9 న్యూస్ 23/4/2026,

______మా గ్రామానికి నిధులు మంజూరు చేయండి అభివృద్ధికి మీ తోడును అందించండి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి పంచాయతీ వార్డు సభ్యుల వినతి,

మంబాపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరించాలని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని పంచాయతీ వార్డు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు…….

పెద్దెముల్: మంబాపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరించాలని మంబాపూర్ వార్డు సభ్యులు తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి కి విన్నవించారు….

ఈ సందర్భంగా బుధవారం రోజు వార్డు సభ్యులు సిరిగల రత్నం చంద్రయ్య ,నర్సింలు లు, తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా తన నివాసంలో కలిసి మంబాపూర్ అభివృద్ధి పట్ల సహకరించాలని మంబాపూర్ గ్రామానికి సంబంధించిన వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు వార్డు సభ్యులు పేర్కొన్నారు.

మురుగు కాలువలు సిసి రోడ్ల నిర్మాణం మంచినీటి వసతి ఇందిరమ్మ ఇల్లు  తదితర సమస్యలపై ఆయనతో చర్చించినట్లు వారు పేర్కొన్నారు.

తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని తప్పకుండా మంబాపూర్ పంచాయతీ అభివృద్ధికి సహకరించడానికి వారు సిద్ధంగా ఉన్నారని వాడు సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *