తాండూర్ యాడ్ కిలోమీటర్ నెంబర్ 71/6, రైల్వే పట్టాల పక్కన గుర్తు తెలియని శవాన్ని గుర్తించిన జి ఆర్ పి, మృతుడి వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్న దర్యాప్తు అధికారి వై వీరేశం,

ప్రమాద వార్తలు,

హిందు 9 న్యూస్ 14/4/2026,

  • తాండూర్ యార్డ్ 71/ 6, నెంబరు గల రైల్వే పట్టాల పక్కన గుర్తు తెలియని శవం______

  • ఎవరికైనా వివరాలు తెలిస్తే వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వండి, వికారాబాద్ జి ఆర్ పి దర్యాప్తు అధికారి వై వీరేశం,

తాండూర్ యార్డ్ పరిధిలో కిలోమీటర్ నెంబర్ 71/6, రైల్వే పట్టాల పక్కన గుర్తు తెలియని శవం పడి ఉన్నట్లు వికారాబాద్ జి ఆర్ పి పోలీసులు గుర్తించినట్లు ఆ వ్యక్తి వివరాలు తెలిస్తే వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని దర్యాప్తు అధికారి వై వీరేశం తెలిపారు……

తాండూర్ :  తాండూర్ యార్డ్ పరిధిలోకి వచ్చే కిలోమీటర్ నెంబర్ 71/6, రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని శవం పడి ఉన్నట్లు గుర్తించామని ఆ వ్యక్తి యొక్క వివరాలు ఎవరికైనా తెలిస్తే వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని, జి ఆర్ పి , దర్యాప్తు అధికారి వై వీరేశం తెలిపారు.

వివరాల్లోకి వెళితే సుమారు 4,00, గంటల సమయంలో వికారాబాద్ రైల్వే స్టేషన్ మాస్టర్ జి ఆర్ పి పోలీసులకు అందించిన సమాచారం మేరకు కిలోమీటర్ నెంబర్ 71/6 వద్దకు తాము వెళ్లి చూడగా అక్కడ ఓ పురుషుడి మృతదేహం కనుగొన్నట్లు దర్యాప్తు అధికారి వై వీరేశం తెలిపారు.

తమ పరిశీలనలో సుమారు 35 సంవత్సరాలు వయస్సు ఉన్న ఓ గుర్తు తెలియని పురుషుడు అక్కడ మృతి చెందినట్లు తాము గుర్తించామని వై వీరేశం తెలిపారు.

మృతుని ఒంటిపై పింకురంగు షర్టు బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. సంఘటన స్థలంలో మృతుడి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎటువంటి పత్రాలు ఆధారాలు వ్యక్తిగత వస్తువులు కూడా లభించలేదని దర్యాప్తు అధికారి తెలిపారు.

ప్రాథమిక పరిశీలనలో మృతుడు ఏదో గుర్తు తెలియని రైలులో ప్రయాణం చేస్తూ రైలు నుండి పడి మరణించినట్లు అనుమానిస్తున్నామని స్పష్టం చేశారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిలో భద్రపరచామని పేర్కొన్నారు.

జరిగిన ఘటనపై కేసు కూడా నమోదు చేయబడినట్లు వారు పేర్కొన్నారు. అయితే మృతుడి గుర్తింపును తెలుసుకునేందుకు దర్యాప్తును చేపట్టామని స్పష్టం చేశారు. జరిగిన ఘటన నేపథ్యంలో ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే అతనికి సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసి ఉంటే వెంటనే వికారాబాద్ జి అర్ పి పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని దర్యాప్తు అధికారి వీరేశం ప్రజలను కోరారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *