ముఖ్యాంశాలు,
హిందు 9 న్యూస్ 12/4/2026,

_______రాజ్ పుతులకు తోడుగా ఉండి కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తా, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి,
రాజ్ పుత్ కమ్యూనిటీకి తోడుగా ఉంటా అధైర్య పడవద్దని కమ్యూనిటీ హాల్ నర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేసి పూర్తి చేస్తామని ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు……..
తాండూర్ : తాండూర్ లోని రాజ్ పుత్ కమ్యూనిటీకి తోడుగా ఉంటానని ఎవరు కూడా అధైర్య పడుద్దని నిర్మాణానికి నిధులు మంజూరు చేసి కమ్యూనిటీ హాల్ పూర్తి చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
అయితే ఇంద్రానగర్ లోని వార్డు నెంబర్ 5 లో రాజ్ పుత్ సమాజం కోసం ఏర్పాటుచేసిన కమ్యూనిటీ హాల్ శిలాఫలకాన్ని ఇటీవల గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటనను ఆదివారం రోజు పరిశీలించారు.శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పట్టణ సీఐ కి ఫోన్ లో ఆదేశించారు.
అనంతరం సమాజ అభివృద్ధి కోసం బాగోగుల కోసం చేపట్టబోయే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేసి పూర్తి చేస్తామని ఎవరు కూడా అధైర్యపడవద్దని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతామని భరోసా నిఇచ్చారు.

కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు ఠాగూర్ సుభాష్ సింగ్ అధ్యక్షులు ఠాగూర్ దిలీప్ సింగ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నికిత ఠాగూర్ సభ్యులు పల్లవి ఠాగూర్ ఉపాధ్యక్షులు ఠాగూర్ రమేష్ సింగ్ ట్రెజరర్ ఠాగూర్ ప్రతాప్ సింగ్ మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ సింగ్ ఠాగూర్ రమేష్ సింగ్ ఠాగూర్ ప్రభాకర్ సింగ్ ఠాగూర్ నర్సింగ్ సింగ్ ఠాగూర్ రాజు సింగ్ రాజపుత్ యువదళ్ అధ్యక్షులు ఠాగూర్ దీపక్సింగ్ ఠాగూర్ శివాజీ సింగ్ లకం సింగ్ సురేష్ ఠాకూర్ ఇతర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
