కందనెల్లిలో గొర్రెల కాపరుల యజమానులను ఓదార్చిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి,

ఓదార్పు

Kura Yadaiah| October 31,2025,

హిందు 9 న్యూస్ డెస్క్ :

Goat| గత మూడు రోజుల క్రితం వీధి కుక్కల దాడిలో మండల్ కందనెల్లి గ్రామంలో 55 గొర్రె పిల్లలు మృతి  చెందిన విషయాన్ని తెలుసుకుని గొర్రెల కాపరుల యజమాని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు….

Goat| గత మూడు రోజుల క్రితం పెద్దేముల్ మండల్ కందనెల్లి గ్రామంలో ఊర కుక్కల దాడిలో 55 గొర్రె పిల్లు మృతి చెందిన ఘటన మానవత వాదులను కదిలించింది.  ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ  ప్రభుత్వ చీఫ్ వీప్ పట్నం మహేందర్రెడ్డి శుక్రవారం రోజు కందనెల్లి గ్రామాన్ని సందర్శించి గొర్రెల కాపరుల యజమానులు కుర్వ పాతప్ప, మల్లమ్మ లను ఓదార్చి తమకు అండగా ఉంటామని భరోసనిచ్చారు.

 

కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి,

అనంతరం చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు  ఫోన్ ద్వారా సమాచారం అందించారు . పంచాయతీ సెక్రెటరీ కి ఫోన్ లో వీధి కుక్కల పట్ల తగు చర్యలు తీసుకోవాలని ప్రజలకు పశువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధ్యత కుటుంబానికి అండగా ఉంటామని గొర్రెల కాపరుల  యజమానులకు బరోసనిచ్చారు.

తర్వతా పెద్దేముల్ తాసిల్దార్ కు కూడా జరిగిన ఘటన  వివరించి ప్రభుత్వం నుండి గొర్రెల కాపరులకు తక్షణ సహాయం అందించాలని  ఆదేశించారు. కార్యక్రమంలో టిపిసిసి ప్రచార సమన్వయ కార్యకర్త కారణం పురుషోత్తమరావు మాజీ సర్పంచ్ పురుషోత్తమరావు మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి అంపల్లి రాజేందర్ పి రాఘవేందర్ రెడ్డి మల్లప్ప కురువ వెంకటయ్య వాజిద్ మియా శాంత్ కుమార్ ఆశప్ప సీనియర్ జర్నలిస్టు రామచందర్ సంజీవ్ బీర్కట్ రఘు శివానంద్ సిద్దు ఆయుఖాన్ తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *