సామాజిక వార్తలు,
హిందు 9 న్యూస్ 5/4/2026,
____బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనలో అందరూ నడవాలి, pow ,రాష్ట్ర కార్యదర్శి వై గీత,

బాబు జగ్జీవన్ రామ్ 18వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని దేశంలో బాబు జగ్జీవన్ రామ్ తీసుకొచ్చిన సంస్కరణలు ఆలోచనలు భారతదేశ పేద బడుగు బలహీన వర్గాల దళిత నిన్న జాతులకు ఎంతో ఉపయోగపడ్డాయని పిఓడబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి వై గీత అన్నారు…..
వికారాబాద్ జిల్లా :ఈ దేశంలో సామాజిక ఆర్థిక అసమాన తల నుండి మానవ అభివృద్ధి సాధించడంలో బాబు జగ్జీవన్ తన వంతు బాధ్యతగా ఎంతో కృషి చేశారని డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై గీతా అన్నారు.
విద్యార్థి దశలోనే పాఠశాలలో విద్యార్థుల తాగునీటి కోసం వెనుకబడిన వర్గాల మీద వివక్షతో అంటరాని వారికోసం అన్ని వర్గాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బద్దలు కొట్టిన చరిత్ర తిరుగుబాటు ఆయనదని కొని ఆడారు.
జనాభాకు సరిపడా ఆహార ధాన్యాల కొరత ఉండి ఆహార ధాన్యం సరిగా అందుబాటులో లేనప్పుడు హరిత విప్లవంలో వ్యవసాయ సంస్కరణలో తీసుకురావడం ఆయన ఎంతో తోడ్పాటున అందించారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఎస్సీ ఎస్టీ వర్గాల ఉద్యోగుల ఉన్నతి కోసం వాళ్ల యొక్క అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు చేయడం జరిగిందని స్పష్టం చేశారు.
ఈ దేశంలో కార్మిక హక్కుల చట్టాల కోసం వారి సంక్షేమం కోసం కనీస వేతనాలు చట్టం ఈఎస్ఐ చట్టం ప్రావిడెంట్ ఫండ్ చట్టం పారిశ్రామిక విధానాల చట్టం ట్రేడ్ యూనియన్ చట్టం ఇలాంటి కార్మిక చట్టాలకు దోహదపడే చట్టాలను తేవడంలో బిఎస్ఆర్ ఎంతో కృషి చేశారని ఆయన సేవలను ఏనాడు కూడా దేశ ప్రజలు మరువలేనిదని పేర్కొన్నారు.
ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తూ ప్రభుత్వం ఆస్తులను దారా దత్తం చేస్తూ కార్పొరేట్ సంస్థల కోసం ఊడిగం చేస్తూ అణగారిన వర్గాల వెనకబడిన వర్గాల కార్మిక వర్గాల హక్కుల కోసం మాట్లాడనీయకుండా నొక్కి వేస్తూ శ్రమదోపిడికి గురి చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
కష్టజీవులు కార్మికులు పేదలు బడుగు బలహీన వర్గాల యొక్క సామాజిక అభివృద్ధి జరగాలంటే బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు.
