సామాజిక వార్తలు,
హిందు 9 న్యూస్ 2/4/2026,

______ముదిరాజులపై అణచివేత కుట్రలను సాగనివ్వం,
_____సమన్వయంతో ముందుకెళ్తే ముద్దిరాజులకు అండగ నిలబడదాం, తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్,
ముదిరాజ్ లపై సామాజిక ఆర్థిక రాజకీయ అణచివేత కుట్రలను సాగనివ్వమని ముదిరాజులు సమన్వయం తో ముందుకెళ్తూ గ్రామీణ ప్రాంత ముదిరాజులకు అండగా నిలబడాలని తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు….
హైదరాబాద్ : ముదిరాజులను సామాజిక ఆర్థిక రాజకీయంగా అణచివేసే కుట్రలు జరుగుతున్నాయని ఇకపై కుట్రలను సాగనివ్వమని ముదిరాజులు సమన్వయంతో ముందుకెళ్తూ గ్రామీణ ప్రాంత ముదిరాజులకు కూడా అండగా నిలబడాలని తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ మహారాజ్ అన్నారు.
హైదరాబాదులోని ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయంలో చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నహాక కమిటీ సమావేశం లో ఈ సందర్భంగా ప్రకటించారు.
ముదిరాజులు ఒకే తాటిపైకి తీసుకొచ్చే విధంగా పనిచేయ బోతుందని ఈ కమిటీలో తీర్మానం జరిగిందని ఆయన తెలిపారు. బిసి-డి నుండి బీసీ ఏ ఏలోకి తీసుకురావడానికి సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
____కోక పేట ముదిరాజ్ ఆత్మగౌరవ భవనాన్ని పూర్తి చేసుకుందాం,
కోకాపేట ముదిరాజ్ ఆత్మగౌరవ భవనాన్ని త్వరలో ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రస్టు నిర్మాణం చేయాలని ఈ సమావేశంలో తీర్మానించినట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజ్ ముఖ్య సంఘ నాయకులు మేధావులు రిటైర్డ్ ఉద్యోగస్తులు రాజకీయ నాయకుల కమిటీ తీర్మానాలను చేయాలని తీర్మానించినట్లు తెలిపారు.
___గ్రామీణ ముద్దిరాజులకు అండగా ఉండదాం,
గ్రామస్థాయి నుంచి ముద్దిరాజులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తాము ఎప్పుడు ముందుంటామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు చొప్పరి శంకర్ ముదిరాజ్, అందే బాబయ్య ముదిరాజ్, ఉప్పరి నారాయణ ముదిరాజ్ , మోరే రోహిత్ ముదిరాజ్, గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, డాక్టర్ రెడ్డబోయిన వినోద్ కుమార్ ముదిరాజ్ బీమా లక్ష్మణ్ ముదిరాజ్ రావుల రాజశేఖర్ ముదిరాజ్ ఆగం పాండు ముదిరాజ్ మోహన్ రాజు ముదిరాజ్ పి వెంకటేష్ ముదిరాజ్ రాజు ముదిరాజ్ కనకయ్య ముదిరాజ్ నిజ్జన రమేష్ ముదిరాజ్, సుభాషిని ముదిరాజ్ దీపికా ముదిరాజ్ చలపతి ముదిరాజ్ చింతల్ శ్రీలత ముదిరాజ్ పిట్టల నాగేష్ ముదిరాజ్ ఆంజనేయులు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
