ప్రెస్ నోట్ ఆధారిత వార్తలు,
హిందు 9 న్యూస్ 29/3/2026,


మార్చి 31న రైతు సేవా సహకార సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు సొసైటీ సీఈవో మురళి గౌడ్ తెలిపారు…..
పెద్దేముల్ : పెద్దెముల్ రైతు సేవా సహకార సొసైటి సర్వసభ్య సమావేశం ఈనెల మార్చి31,న నిర్వహిస్తున్నట్లు సొసైటీ సీఈవో మురళి గౌడ్ తెలిపారు.
మంగళవారం రోజు పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సొసైటి కార్యాలయంలో ఇట్టి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఆడిట్ జమ ఖర్చులు సొసైటీ అభివృద్ధి రైతు సంక్షేమం తదితర అంశాలపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి రైతు సేవా సహకార సంఘం సభ్యులందరూ హాజరై సలహాలు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.
