అభివృద్ధిలో దూసుకుపోతున్న రేగొండి-“మంచినీటి” కొరత లేకుండా చూస్తామన్న సర్పంచ్ డి అశోక్ కుమార్

ప్రగతి వార్తలు,

హిందు 9 న్యూస్/20/3/2026:

_______ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో ఇంకాస్త అభివృద్ధి కోసం కృషి చేస్తాం, సర్పంచ్ అశోక్ కుమార్,

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అధికారుల సహకారంతో రేగొండి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని రాబోయే రోజుల్లో గ్రామంలో ఎమ్మెల్యే అధికారుల సహకారం పంచాయతీ సభ్యుల గ్రామ పెద్దల గ్రామస్తుల సమిష్టి పోత్బలంతో గ్రామాన్ని ఇంకాస్త అభివృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని సర్పంచ్ దండెగళ్ళ అశోక్ కుమార్ అన్నారు…..

పెద్దేముల్ : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రేగొండి గ్రామపంచాయతీ లో సిసి రోడ్లు డ్వాక్రా భవనం మంచినీటి వసతి కల్పన అలాగే సిసి బెడ్ల నిర్మాణం చేపట్టామని గ్రామ సర్పంచ్ దండగళ్ల అశోక్ కుమార్ తెలిపారు.

ఎనర్జీ ఎస్ నిధులతో 5, 00,లక్షల సిసి రోడ్డు పనులను ఎస్సీ కాలనీ ట్రాన్స్ఫారం నుండి రైతులు కూలీలు పొలాలకు అలాగే  సులభంగా వెళ్లి  రావడానికి కాగ్నా నది కి వెళ్లే పానాది రోడ్డును వేశామని ఆయన తెలిపారు.

సీసీ రోడ్డు నిర్మాణ దృశ్యం

గతంలో ఈ పానాది గుండా రైతులు కానీ కూలీలు కానీ లేదా పశువుల కాపరులు పశువులను తీసుకెళ్లాలంటే కూడా చాలా బుర్దమయంగా గుంతలు గుంతలు గా ఉండేదని ప్రస్తుతం ఈ సీసీ రోడ్డు నిర్మాణం వల్ల అట్టి సమస్య కొంత తీరిందని రైతులు కూలీలు పశువుల కాపరులు వెళ్లి రావడానికి కాస్త ఇబ్బంది లేకుండా అయిందని ఆయన తెలిపారు.

మరి కొంత భాగం రాబోయే రోజుల్లో వేయడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఆ సిసి రోడ్డు వేయడం వల్ల ఆ ప్రాంతంలో అపరిశుభ్రత లేకుండా కూడా చూడడం జరిగిందని పేర్కొన్నారు.

నిర్మాణ దశలో ఉన్న డ్వాక్రా భవన దృశ్యం 

మరొక్క అంశం ఏమిటంటే గ్రామంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో డ్వాక్రా మహిళల అభివృద్ధి సంక్షేమం దృష్ట్యా డ్వాక్రా భవనం మంజూర అయిందని అట్టి భవనం రావడం చాలా సంతోషంగా ఉందని ప్రస్తుతం డ్వాక్రా భవనం నిర్మాణ దశలో ఉందని అది పూర్తయితే తప్పకుండా గ్రామంలో ఉన్న డ్వాక్రా మహిళలు వారి పొదుపు వారి లావాదేవీలు మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

భవనం లేకపోవడం వల్ల గతంలో గ్రామ పంచాయతీలోని డ్వాక్రా మహిళలు వారి సమస్యలు పొదుపు తదితర లావాదేవీలపై అక్కడే చర్చించుకునే వారని ప్రస్తుతం భవనం నిర్మాణం దశలో ఉందని భవనం పూర్తయితే త్వరలోనే డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

నూతన నల్లాల ఏర్పాటు దృశ్యం

వేసవికాలం ఉన్నందున ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్థానిక అధికారులు చెప్పారని ఆ దిశలోనే పంచాయతీలో ప్రస్తుతం ఎలాంటి నిధులు లేకున్నా  గ్రామములో మంచినీటి కొరత లేకుండా బీసీ కాలనీలో మంచి నీళ్ల నల్లాలను బిగించామని పూర్తిస్థాయిలో బీసీ కాలనీలో మంచి నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

ప్రస్తుతం ఏర్పాటు చేసిన నల్లాల వల్ల ప్రజలకు దాహార్ని తీర్చడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే వార్డుల వారీగా నీటి సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

మురుగు కాలువలపై బెడ్ల నిర్మాణం

అలాగే మురుగు కాలువలపై  బెడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో వాటిని కూడా  గ్రామంలో ఎక్కడెక్కడ  బెడ్లు కూలిపోయిన వాటిని గుర్తించి వాటి స్థానంలో నూతన బెడ్లను వేస్తున్నామని ఇప్పటికే గ్రామంలో చాలా చోట్ల కూలిపోయిన  బెడ్లను నిర్మించామని సర్పంచ్ పేర్కొన్నారు.

కొన్ని ప్రాంతాలలో  బెడ్ల నిర్మాణం పూర్తి కావాల్సిన అవసరం ఉందని వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తూ ఇంక నీటి సమస్య తీరని ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ కూడా నూతన నల్లాలను బిగిస్తామని ప్రకటించారు.

గ్రామంలో క్రమ పద్ధతి విద్యుత్ లైన్ కోసం కృషి,

గ్రామంలో కరెంటు సమస్య తీవ్రంగా ఉందని గ్రామము ఏర్పాటు జరిగినప్పుడు ఏర్పాటు చేసన విద్యుత్ లైన్ చాలాకాలం కావడంతో స్తంభాలు అక్కడక్కడ పాడైపోయి నెలవొంగి ఉన్నాయని అలాగే గ్రామంలో ప్రస్తుతం ఉన్న స్తంభాలు క్రమ పద్ధతిలో లేకుండా రాకపోకలకు ఇబ్బంది జరుగుతున్నదని కొన్ని స్తంభాలు ఇండ్ల మధ్యలోనే ఉన్నాయని వాటి వల్ల జనాలకు ఏవైనా నిర్మాణాలు చేపట్టాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల లాంటివి కూడా నిర్మించుకోవాలంటే సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తు చేశారు.

గ్రామంలో పాడైపోయిన స్తంభాలతో పాటు క్రమ పద్ధతిలో లేని స్తంభాలను కూడా క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసే విధంగా విద్యుత్ అధికారులతో చర్చించి పంచాయతీ సభ్యులు గ్రామ పెద్దల సహకారంతో నాణ్యమైన విద్యుత్ కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

నూతన స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ వాల్ కోసం కృషి,

వీటితో పాటుగా గ్రామంలో స్కూల్ బిల్డింగ్ ప్రస్తుతం పాడైపోయిందని వర్షాకాలం వస్తే బిల్డింగుల్లోకి నీళ్లు వస్తున్నాయని ఆ బిల్డింగు నిర్మాణం జరిగి చాలా రోజులు కావడంతో వాటి కాలపరిమితి కూడా పూర్తయినట్లుగా అనుమానాలు కలుగుతున్నాయని నూతన పాఠశాల భవన నిర్మాణం కోసమైనా లేదా ఉన్న పాఠశాలలో పైన పూర్తి స్థాయిలో మరమ్మతలు చేసి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నదే తమ ఆకాంక్షాన్ని పేర్కొన్నారు.

స్కూల్ కాంపౌండ్ వాల్ కూడా ప్రస్తుతం కూలిపోయి ఉన్నదని కాంపౌండ్ వాల్ కూలిపోవడం వల్ల గ్రౌండ్ లోకి పశువులు మేకలు పందులు చొరబడుతూ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు.

-గ్రామంలో గుర్తించని సమస్యలను గుర్తించి, దశలవారీగా అభివృద్ధి చేస్తాం, సర్పంచ్ అశోక్ కుమార్,

సర్పంచ్ అశోక్ కుమార్

ఇంకా గ్రామంలో గుర్తించని సమస్యలు ఏవైనా ఉంటే వాటిని కూడా గుర్తించి వాటితో పాటు కరెంటు సమస్య, స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ వాల్  గ్రామంలో మురుగు కాలువల నిర్మాణం సిసి రోడ్ల నిర్మాణం, తమ గ్రామ చివరిలో ఉన్న ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం వీరాంజనేయుల గుడికి విద్యుత్ లైన్ ను కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని వీటన్నిటిని దశలవారీగా స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి సహకారం ప్రభుత్వ అధికారుల సహకారం తో అభివృద్ధి పనులను చేపడతామని తెలిపారు.

అభివృద్ధికి గ్రామస్తుల సమిష్టి సహకారం అవసరమే,

గ్రామస్తుల సమిష్టి సహకారంతోనే అభివృద్ధి దిశలో దూసుకుపోయేలా చూస్తామని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో గ్రామం అభివృద్ధి అభివృద్ధి దిశగా పరుగులు పెట్టేందుకు పంచాయతీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తుల సమిష్టి సహకారం అవసరం ఉందని తప్పకుండా గ్రామ అభివృద్ధి జరిగితే కుటుంబాల అభివృద్ధి జరుగుతుందని అందరూ గ్రామ అభివృద్ధికి పాటు పడాల్సిన అవసరం ఉందని  అశోక్ తెలిపారు.

ఇప్పటికే సిసి రోడ్లు డ్వాక్రా భవనం మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి సహాయపడిన తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ఇతర పార్టీ పెద్దలు అధికారులకు గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.

-ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కౌట్

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ నిర్మాణంలో భాగంగా గ్రామంలో బీసీ వర్గానికి చెందిన నిరుపేద బర్ల సంగప్ప అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో శుక్రవారం రోజు గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ చేత ఇల్లు నిర్మించుకోవడానికి మార్కెటింగ్ ఇప్పించామని సర్పంచ్ తెలిపారు.

కార్యక్రమంలో, కే మానేయ్య, ఎండి మైహిముద్, పి, బంద్యయ్య వార్డు సభ్యులు కూరటి చంద్రకళ, పంచాయతీ వర్కర్ టి, రాములు, టి వెంకటయ్య కూరటి భీమయ్య, జే వెంకటయ్య, దుగ్గపురం శ్రీనివాస్, దండేగళ్ల చంద్రప్ప, డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు సాయమ్మ , గోపాల్ వార్డు సభ్యులు లింగేష్, డి రత్నం, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *