మార్చ్ 22న రైతు భరోసా!

వ్యవసాయం,

హిందు 9 న్యూస్/ మార్చ్ 15,2026,

_______రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల,

హైదరాబాద్: ఉగాది పండగ వేళ రాష్ట్ర రైతాంగానికి రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2026, మార్చి 22న ఈ సీజన్ రైతు భరోసా తొలి విడత నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపింది.

సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి తొలి విడత నిధులను విడుదల చేయనున్నారు. తొలి విడతలో భాగంగా ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖతాల్లో నిధులు జమ చేయనున్నారు.

ఫస్ట్ ఫేజ్‎లో రూ.3,590 కోట్ల నిధులు విడుదల చేయనుండగా 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. తొలి విడత నిధులు విడుదల చేసిన 20 రోజుల తర్వాత సెకండ్ ఫేజ్ నిధులు రిలీజ్ చేయనున్నారు. రెండో విడతలో భాగంగా రూ.2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జమ వేయనున్నారు.

ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులు విడుదల చేయనున్నారు. మొత్తం మూడు విడతల్లో రూ.9 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.

కాగా, రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ప్రభుత్వం రైతులకు ఆర్ధిక సహయం చేస్తోన్న విషయం తెలిసిందే. పంట పెట్టుబడి సహయం కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తోంది.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *