స్పాట్ న్యూస్, శిక్షణ,
Kura Yadaiah |March 13,2026,
హిందు 9 న్యూస్ :

___పంచాయతీలో బాధ్యతగా మెలగండి, ఎంపీడీవో రతన్ సింగ్,
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పెద్దెముల్ మండలం లో గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు ఏర్పాటుుుు చేసిన శిక్షణ శిబిరం శుక్రవారంం తో ముగిసిందని ఇక మీదట వార్డు సభ్యులు గ్రామాలలో బాధ్యతగా మెలగాలని గ్రామ అభివృద్ధికి పాటుపడాలని ఎంపీడీవో రతన్ సింగ్ తెలిపారు…
పెద్దేముల్: ఇటీవల స్థానిక సంస్థల్లో పంచాయతీ వార్డు సభ్యులుగా గెలుపొందిన వారికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంచాయతీరాజ్ చట్టం, గ్రామాల అభివృద్ధి పరిశుభ్రత, వ్యవసాయం ,విద్య ,వైద్యం, విధులు, బాధ్యతలు, తదితర అంశాలపై పెద్దేముల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి రతన్ సింగ్ సూచించిన మూడు సెంటర్లలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారం రోజుతో ముగిసిందని ఆయన తెలిపారు.

__ గ్రామాల అభివృద్ధికి సహకరించాలి,
గ్రామాలలో ఇకనుండి పంచాయతీ వార్డు సభ్యులు బాధ్యతగా మెలగాలని గ్రామాల అభివృద్ధి పరిశుభ్రత విద్య వైద్యంలో ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించి ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని వార్డు సభ్యులను ముగింపు సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ లతోపాటుగా పలు గ్రామాల్లో వార్డు సభ్యులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
