ముఖ్యాంశాలు,
Kura Yadaiah /March 9,2026,
హిందు 9 న్యూస్ :

డివైడర్ తో మంబాపూర్ కు కొత్త అందం సంతరించుకోబోతుంది దాంట్లో భాగంగానే సోమవారం రోజు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పనుల పురోగతిపై ఆరా తీస్తూ పరిశీలించారు….
హిందు 9 న్యూస్ (పెద్దేముల్9,) హైదరాబాద్ తాండూర్ వెళ్లే మెయిన్ రోడ్డుపై డివైడర్ నిర్మించాలని చాలా కాలం నుండి గ్రామ ప్రజలు ఆశపడ్డారు. ఆ ఆశ నేటితో నెరవేరినట్టయింది. అయితే గత రెండు రోజులుగా డివైడర్ పనులు ప్రారంభం కావడంతో స్థానికల్లో సంతోషం వెళ్లి విరిసింది.

డివైడర్ వల్ల ప్రమాదాలు కూడా నివారించుకోవచ్చని స్థానికులు భావిస్తున్నారు. డివైడర్ పనులను సోమవారం రోజు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాయిని నారాయణరెడ్డి కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డివైడర్ పూర్తి అయితే మంబాపూర్ కు లుక్ వస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
