కుల దురహంకారంతో పసికూన హత్య నీచమైన పనే,

ముఖ్యాంశాలు,

Kura Yadaiah/ February 24, 2026,

హిందు 9 న్యూస్ ;

కుల దురహంకారంతో పసికూన ను హత్య చేయడం నీచమైన పనేనని ఈ హత్య కు బాధ్యులైన వారిని తక్షణమే అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షించాలని బాధ్యత కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలవాలని ఇట్టి ఘటనను తెలంగాణ ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత డిమాండ్ చేశారు…..

హిందు 9 న్యూస్ (వికారాబాద్ 24): నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర మల్లన్న జాతర లో అగ్రకుల దురహంకారముతో రజక కుటుంబానికి చెందిన పసికందును కాళ్లతో తన్ని గొంతు నులిమి చంపడం అమానుషమైన నీచమైన చర్య అని ఈ ఘటనను ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత తెలిపారు.

ఈ ఘటనకు పాల్పడిన అగ్రకుల పెత్తందారులను అరెస్టు చేసి బాధ్యత కుటుంబానికి పోలీసు యంత్రాంగం ప్రభుత్వం, అండగా నిలబడాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహి స్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే యావత్ సమాజం తలదించుకునేలా చిన్నపిల్ల అని  చూడకుండా హత్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల జరిగిన దాడి సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ దాడి  ఒక కుటుంబం పై జరిగిన దాడి కాకుండా యావత్ మహిళల ఆత్మగౌరవంపై దళిత బీసీ సమాజంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.

ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యము వస్తే   పౌర హక్కులకు మానవ హక్కులకు భంగం కలగకుండా చూస్తామని ఒకనాడు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నేడు ఇలాంటి దుర్ఘతలు జరుగుతుంటే తక్షణమే స్పందించాల్సిన ముఖ్యమంత్రి స్పందించకపోవడం విడ్డూరమని అన్నారు.

పక్క రాష్ట్రంలో అదే కర్నూలు ప్రాంతంలో ఒక చిన్నారి పై ఒక నికృష్టుడు హత్యకు పాల్పడితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే ఆ కుటుంబాన్ని ఫోన్ ద్వారా పలకరించి ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబానికి బాసటగా నిలబడతామని చెప్పిన సందర్భం ఉంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికి ఆ కుటుంబాన్ని పలకరించిన సందర్భం కూడా కనిపించడం లేదని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఉన్న మానవత్వం ఇక్కడి ముఖ్యమంత్రి కి లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.

ఆధిపత్య కులవర్గ అహంకారంతో దళిత మహిళను అసభ్య పదజాలంతో దూషించడం ఆమెను ఆమె భర్తను గదిలో బంధించి కులం పేరుతో అవమానించడం దళిత హక్కులకు మానవ హక్కులకు భంగం కలిగించడమేనని ఆమె స్పష్టం చేశారు.

అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కావడంతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనుమానాలు బలపడుతున్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

ఇటువంటి నేరాల పట్ల సామాజిక అణచివేతల పట్ల దళిత బడుగు బలహీన బీసీ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి దాడులను కలిసికట్టుగా ఖండించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

ఇప్పటికైనా తక్షణమే పసికందు హత్యకు బాధ్యులైన నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని, ఈ ఘటనపై వేగంగా న్యాయవిచారణ జరపడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యత కుటుంబానికి సముచితా న్యాయం చేయడంతో పాటు ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

కుల వివక్ష మహిళలపై హింసను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *