నిరసన
Kura Yadaiah| November 13, 2025,
హిందు 9 న్యూస్ బ్యూరో ,


Bc|బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని , వాటికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తాండూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్మ పరాట దీక్షను ప్రారంభించారు ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్…
Bc|తాండూర్ : బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని అదేవిధంగా చట్టబద్ధత కై పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ జాతీయ కార్యవర్గ సభ్యులు కందకు రాజ్కుమార్ తాండూర్ అంబేద్కర్ చౌక్ వద్ద ధర్మ పోరాట దీక్షకు పూనుకున్నారు.
గురువారం రోజు తాండూరు పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో రాజ్ కుమార్ దీక్ష చేపట్టారు. బీసీ రిజర్వేషన్లు అమలుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత తీసుకొని అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటి పైకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ బీసీ రిజర్వేషన్ల అంశంపై సానుకూలంగా స్పందించి వెంటనే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని రాజకుమార్ డిమాండ్ చేశారు. బీసీ అని చెప్పుకుంటున్న భారత ప్రధాని తమ జాతికి తగిన న్యాయం చేయాల్సిన అవసరం భారత ప్రధానిపై ఉందని అప్పుడే జాతి బిడ్డలు భారత ప్రధాని సేవలను గుర్తించుకుంటారని తెలిపారు.

60 శాతం ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నిస్తుంటే కొంతమంది నేతలు అడ్డుకోవడం అన్యాయమని బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో న్యాయబద్ధంగా జనాభా ప్రాతిపాదికన దక్కాల్సిన హక్కులు దక్కకుండా చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలు రాజకీయంగా ఎదగడం ఇష్టం లేకనే కొంతమంది కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని బీసీలు ఒక్కసారి తమ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించాలని అన్ని పార్టీలలో ఉన్న బీసీలు కూడా జరుగుతున్న వ్యవహారాలను కుట్లను కుతంత్రాలను అర్థం చేసుకోవాలని రాజ్ కుమార్ బీసీలకు విజ్ఞప్తి చేశారు.

బీసీలు పార్టీల జెండాలు మోయడం పార్టీ కండువాలు కప్పుకోవడం నినాదాలు ఇవ్వడం వరకేనా లేక బీసీలు కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలని లేదా బీసీలు ఇది కూడా గమనించాలని రాజ్ కుమార్ బీసీలకు గుర్తు చేశారు. బీసీలు ప్రజాస్వామ్య ఉద్యమాలకు సిద్ధం కావాలని బీసీలకు రాజ్ కుమార్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సయ్యద్ సుకుర్ గడ్డం వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత కార్యదర్శి మంజుల నరసమ్మ విజయలక్ష్మి శివ లీల యాలాల పెద్దేముల్ తాండూర్ మండలాల అధ్యక్షులు లక్ష్మణ్ చారి శ్రావణ్ కుమార్ బసంత్ కుమార్ విద్యావంతుడు పర్యాద రామకృష్ణ అరుణ్ రాజ్ శివ నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు పరమేష్ రాము మంతటి రాజు పరమేష్ జోసెఫ్ రాజు ప్రవీణ్ పండు గౌడ్ దుబాయ్ వెంకట్ నరసింహ జగన్ నరహరి కార్తీక్ కిరణ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
