రేపే పెద్దేముల్ రైతు సేవా సహకార సంఘం సమావేశం, రైతులు పాల్గొని విజయవంతం చేయాలన్న సీఈఓ మురళీధర్,

వ్యవసాయం, ప్రభుత్వం,

Kura Yadaiah| September 30,2025

Cooperative society|రేపే పెద్దేముల్ మండల రైతు సేవా సహకార సంఘం సభ్యత్వ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ రైతులందరూ ఈ సమావేశంలో పాల్గొనాలని సీఈఓ మురళీధర్ తెలిపారు……

Cooperative society|  పెద్దేముల్ :రేపే పెద్దేముల్ మండల రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్  యొక్క సాధారణ సభ్యత్వ సమావేశం  30,9, 2025 మంగళవారం రోజు  నిర్వహిస్తున్నట్లు రైతు సేవ సహకార సంఘం లిమిటెడ్ సీఈఓ జి మురళీ దర్ తెలిపారు. ఈ సమావేశం రైతు సేవా సహకార సంఘం ఆవరణలో జరుపుతున్నట్లు ఆయన  తెలిపారు.

-సమావేశంలో చర్చనీ అంశాలు,

ఈ సమావేశంలో జనవరి 1, 2024 నుండి మార్చ్ 31 2025 వరకు గల వార్షిక జమ ఖర్చుల పట్టికను ఆమోదించుట,2024 నుండి 25 సంవత్సరం యొక్క ఆస్తి అప్పుల పట్టిక తోపాటు, 2025 -26 వార్షిక సంవత్సరం అంచనా బడ్జెట్ను నిర్ణయించుట ,2024 సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ ను ఆమోదించుట, 2024 -25 సంవత్సరం యొక్క సంఘం ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయుటతో పాటు పాలకవర్గం ఆరు నెలలు పొడిగింపు పై తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు మురళి గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి చైర్మన్, శ్రీనివాస్ సంగారెడ్డి మేనేజర్ హాజరవుతారని తెలిపారు. సంఘంలో సభ్యత్వంం ఉన్న రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *