పెద్దేముల్ లో ఘనంగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 16, వర్ధంతి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్,

నివాళులు,

K, Yadaiah|September 2,2025,

పెద్దేముల్ లో ఘనంగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు…..

పెద్దేముల్: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నీ 16వ వర్ధంతి వేడుకలను పెద్దిం ముళ్ళు కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి. మహిపాల్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ పరిపాలనలో ఎన్నడూ లేని విధంగా ప్రతి రైతుకు రుణమాఫీ జరిగిందని అలాగే ప్రతి యొక్క అర్హులైన కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇచ్చారని నేతలు పేర్కొన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాలను తీసుకొచ్చి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేదలందరికీ ఆపద్బాంధవుడుగా నిలిచారని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అందుకే రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కాని ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని ఆయనంటే ఇప్పటికీ ప్రజల్లో ఎనలేని ప్రేమ అభిమానాలు ఉన్నాయని తెలిపారు. పెద్దెముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు స్థలం ఇచ్చి సొంత భవనం నిర్మించాలని వైయస్సార్ ఆనాడు ఆదేశించారని ఈరోజు ప్రస్తుతం పెద్దేముల్ లో ఉన్న జూనియర్ కాలేజ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నే మంజూర్ అయిందేనని రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ రియాజ్ తెలిపారు. కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ప్రజలకు పండ్లు పలారాలు పంచిపెట్టారు.

ఈ కార్యక్రమంలో తటేపల్లి పి ఎస్ సి ఎస్ డైరెక్టర్ ఉప్పరి మల్లేశం, పి ఎస్ సి ఎస్ డైరెక్టర్  కే, రవి, శోభారాణి సారా విద్యాసాగర్ సయ్యద్ షబీర్ , బీసీ సెల్ మండల అధ్యక్షుడు బుద్ధారం వెంకటయ్య, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు నారాయణ ఏ బ్లాక్ కార్యదర్శి సయ్యద్ మీనాస్ గొల్ల గోపాల్ పండగల రాజు ఎర్ర రవి ఎర్ర వెంకటేష్ ఫయాజ్ గాజుల ఇబ్రహీం నాగిరెడ్డి జమాల్ ముక్తర్ తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *