సామాజిక వార్తలు,
హిందు 9 న్యూస్ 14/4/2026,

-
అంబేద్కర్ దేశ ప్రజల నోటా అందరివాడిగా మిగిలాడు__
-
అంబేద్కర్ ఎప్పుడు సంపద గురించి ఆలోచించలేదు__
-
అందుకే ప్రపంచ దేశాలలో ఒకటిగా భారతదేశము నిలిచింది, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,
తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచనలు ఆశయాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి తెలిపారు……
తాండూర్ : అంబేద్కర్ ఆశయాలు ఆలోచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ తో పాటుగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా అన్నారు.

అంబేద్కర్ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరి నోటా అందరివాడిగా ఉన్నాడు అంటే విశాలమైన భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించి అందరివాడుగా అంబేద్కర్ నిలిచారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.
ప్రపంచ దేశాల్లోనే ప్రముఖంగా ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలలో విద్యను అభ్యసించి విద్యావేత్తగా విశాలవంతమైన ఆలోచనతో జీవితం గడుపుతూ ఎంతో సంపద సంపాదించే అవకాశం ఉన్న ఏ ఒక్క రోజు కూడా వాటి గురించి ఆరాటపడని గొప్ప మహనీయుడని ఆయన కొనియాడారు.
తాను చదువుకున్న చదువు తన దేశ ప్రజలకు ఉపయోగపడాలని భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియచెప్పాలని అనుకున్నాడు కాబట్టి ఏ ఒక్క రోజు కూడా తన ఎదుగుదలను ఆలోచించలేదని ఆయన పేర్కొన్నారు.
___అద్భుతమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఇచ్చాడు,
అంబేద్కర్ ఆ రోజుల్లో భారతదేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించడం వల్లనే ఈరోజు ప్రపంచ దేశాలలో భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నదని తెలిపారు.
విద్యతోనే వికాసం వస్తుందని వికాసంతోనే సమానత్వం వస్తుందని ఆయన ఆలోచించాడు అందుకే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆలోచనలను ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు.

విద్యార్థులందరూ కూడా జీవితంలో పైకి వచ్చినప్పుడు సమాజంలో తప్పకుండా అసమానతలు పోతాయని అది ఒక విద్యతోనే సాధ్యమవుతుందని తెలియజేశారు.

___డ్రగ్స్ వద్దు అభివృద్ధి ముందు,
డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అంబేద్కర్ చూపిన బాటలో యువత విద్యార్థులు ముందుకు నడవాలని కుటుంబాలకు ఆదర్శంగా భారతదేశానికి వెన్నుదన్నుగా నిలవాలని ఆకాంక్షించారు. ఆ దిశగా అందరం కలిసి ఉనుమందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ పార్క్ లో ఏర్పాటుచేసిన సంపత్తి భోజనాలలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని అందరికీ సమానత్వం చాటారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ నీరజా, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాలు కుల సంఘాలు అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు.
