అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే, ప్రతి పౌరుడికి స్వేచ్ఛ సమానత్వం, సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పరిగి డివిజన్ కార్యదర్శి మల్లేష్,

సామాజిక వార్తలు,

హిందు 9 న్యూస్ 14/4/2016:

  • నేటి యువత పులే అంబేద్కర్ ఆశయాలను పుణికిపుచ్చుకోవాలి,

అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారానే ప్రతి పౌరుడికి స్వేచ్ఛ సమానత్వం భారతదేశంలో లభించాయని అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో సిపిఐ ఎంఎల్ పరిగి డివిజన్ కార్యదర్శి మల్లేష్ అన్నారు….

పరిగి ; అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారానే ప్రతి పౌరుడికి స్వేచ్ఛ సమానత్వం లభించాయని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పరిగి డివిజన్ కార్యదర్శి మల్లేష్ అన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకల సందర్భంగా పరిగి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రసంగించారు.

విద్య పొందండి సంఘటితం అవ్వండి పోరాడండి అనే సందేశం తో ప్రజలను వచ్చారని అన్యాయాలు అసమానతలను తొలగించడానికి ఆయన జీవితాంతం పోరాటం చేసి దేశంలో త్యాగమూర్తిగా నిలిచారని మల్లేష్ కొనియాడారు.

ఆ రోజుల్లోనే అర్థశాస్త్రం న్యాయ శాస్త్రం రాజకీయాలలో గొప్ప పాండిత్యం కలిగిన వ్యక్తిగా అంబేద్కర్ నిలిచారని అంబేద్కర్ నిలిచారని పేర్కొన్నారు.

అణగారిన వర్గాల హక్కుల కోసం ఆధునిక భారతదేశ కోసం అలుపెరుగని పోరాటం చేసి దేశ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ప్రజల మధ్య అంతరాలు లేని సమ సమాజం రావాలని ఆ సమ సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆ మహనీయుడు కలలు కన్నారని తెలిపారు.

నేటి యువత అంబేద్కర్ పులే ఆశయాలను పునికి పుచ్చుకొని సమాజ మార్పుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శివకుమార్ మల్లేష్ నరేష్ ప్రకాష్ రాజు వెంకటయ్య అంజయ్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *