ముఖ్యాంశాలు,
హిందు 9 న్యూస్ :19/3/2026,


______దేవాలయాల్లోనైన ప్లాస్టిక్ నిషేదిద్దాం, సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ నేత మోతె రవి కుమార్,
కనీసం దేవాలయాలలోనైనా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ నేత రవి కుమార్ అన్నారు…
హైదరాబాద్ :కనీసం దేవాలయాలలో నైన్ ఓ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవి కుమార్ అన్నారు.
గురువారం రోజు ఉగాది సందర్భంగా ఎన్జీవో కాలనీ గణేష్ దేవాలయం నందు పంచాంగ శ్రావణంలో ఆలయ ప్రధాన కార్యదర్శి సోమయాజులతో కలిసి పాల్గొంటూ ఈ సందర్భంగా అన్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని రాష్ట్రంలో కానీ కనీసం దేవాలయాల్లో గాని నిషేధించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ వాడకం వల్ల అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుందని ప్లాస్టిక్‌ను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
