ముఖ్యాంశాలు
Kura yadaiah| January 22,2026,
హిందు 9న్యూస్ బ్యూరో :

School | ప్రభుత్వానిబంధనలను ఉల్లంఘిస్తూ అకాడమిక్ ఇయర్ పూర్తికాకుండానే అడ్మిషన్లను ప్రారంభిస్తున్న తాండూర్ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అలాగే ఆ యొక్క స్కూల్ పర్మిషన్ను రద్దు చేయాలని పిడిఎస్యు శ్రీనివాస్ డిమాండ్ చేశారు….
School|తాండూర్ : 2025 -26 అకాడమిక్ సంవత్సరం పూర్తి కాకముందే 2026 -27 సంవత్సరం యొక్క అడ్మిషన్లు ప్రారంభించడాన్ని పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. గతంలో కూడా తాండూర్ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం అకాడమిక్ ఇయర్ పూర్తికాకుండానే అడ్మిషన్లను ప్రారంభించి ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కిందని దానిని స్థానిక విద్యాధికారులు చూస్తూ పోవడం తప్ప ఏమి చేయలేకపోయారని ఆరోపించారు.
తాండూర్ శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విద్యా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం,
ప్రస్తుతం మళ్లీ అకాడమిక్ ఇయర్ పూర్తి కాకుండానే ఈ సంవత్సరం కూడా అమాయకమైన తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అడ్మిషన్లను జనవరి 23 తారీకు నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రచారం ప్రారంభించారని దీనిని తక్షణమే నిలిపివేసి స్థానిక విద్యాధికారులు గాని జిల్లా విద్యాధికారులు గాని చర్యలు తీసుకోకపోతే విద్యా కమిషన్కు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. శ్రీ చైతన్య మళ్లీమళ్లీ ప్రభుత్వం నిబంధనలను చట్టాలను ఉల్లంఘిస్తూ పాఠశాలను నడపడం అంటే మిగతా పాఠశాలల యాజమాన్యాన్ని కూడా ప్రోత్సహించినట్లే అవుతుందని అలాంటప్పుడు ఈ జిల్లాలో విద్య అధికారులు స్థానిక విద్యార్థి కారులు ఉండి ఏమి లాభం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యాధికారులు ఉండి ఏమి లాభం?
యాజమాన్యం స్వార్థం కోసం స్వలాభం కోసం ప్రభుత్వాల నిబంధనలను ఉల్లంఘించి పాఠశాలలను నడుపుతుంటే స్థానికంగా విద్యాధికారులు ఉండి ఏమి లాభం చెప్పాలని మండిపడ్డారు. పూర్తిగా విద్యావ్యవస్థ విద్యాధికారులు జిల్లాలో నిద్రావస్థలోకి వెళ్లి పోయినట్లు అనుమానాలు కలుగుతున్నాయని ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకుపోవడం ఏంటో అర్థం కావడం లేదని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ప్రజాముకంగా తెలుపాలని కోరారు. తాండూర్ లో అన్ని పాఠశాలలకు ఒక రూల్ ఉంటే మరి శ్రీ చైతన్య స్కూలు కు ఒక రూల్ ఉంటుందా? అంటూ గాటుగా ప్రశ్నించారు. ఒకపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి మంత్రివర్గం ఎమ్మెల్యేలు ప్రజలకు ప్రజాపాలన అందిస్తామని ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన ఉంటుందని సమావేశాలలో సభలలో గొంతులు చించుకొని చెబుతుంటే స్థానికంగా ఉన్నటువంటి పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరులు ప్రభుత్వానికి చెడ్డ పేరును తెచ్చే విధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా జిల్లా విద్యాధికారైనా స్థానిక విద్యాధికారి అయిన లేదా స్థానిక ఎమ్మెల్యే అయిన తక్షణమే స్పందించి ప్రభుత్వాలు నియమించిన నియమ నిబంధనలను పాటిస్తూ పాఠశాలలను నడపాలని ఆదేశించాలని కోరారు.

ప్రజాపాలనకు అర్థం లేకుండా పోతుంది,
లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటున్నట్లు ప్రజాపాలనకు అర్థం లేకుండా పోతుందని శ్రీ చైతన్య వ్యవహరిస్తున్న తీరును చూస్తే ప్రజాపాలనను వ్యతిరేకిస్తున్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. చెప్పుకుంటున్న ప్రజా పాలనకు అర్థం పరమార్ధం ఉండాలంటే తక్షణమే స్పందించి శ్రీ చైతన్య పై చర్యలు తీసుకొని ఆ స్కూల్ పర్మిషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ విద్యా సంవత్సరంలో చట్టాలకు ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ పాఠశాలలు పాల్పడిన పాఠశాలల ముందే నిరాహార దీక్షలకు కూసుంటామని హెచ్చించారు.
