నిరసన,
by, KURA YADAIAH| October 27,2025,
హిందు 9న్యూస్ డెస్క్:

Tandur MCH| నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, అన్నట్టు ప్రజల కోసం పుట్టుకొచ్చిన పాట ఓ సినిమాలో ఒకప్పుడు ఈ పాట యావత్ సమైక్య ఆంధ్ర ప్రదేశ్ లోనే సంచలనాలను సృష్టించింది. ఆరోజు ప్రభుత్వ దవఖానాలో ఉన్న పరిస్థితులు సౌకర్యాలు నాటి ప్రజా జీవితం పై ప్రభుత్వ దవఖానాలు చూపిస్తున్న చొరవ పై దవఖానాల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ ఈ పాట ఆనాడు పుట్టుకొచ్చింది. అది ఎంతో ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసింది కూడా. అయితే ప్రస్తుత పరిస్థితులలో కూడా ఆ పాటను తాండూర్ ఎంసిఎచ్ ఆసుపత్రి అనేక సందర్భాలలో ప్రజలకు గుర్తుకు తెచ్చిన సందర్భాలు కొక్కోలాలు. తాండూర్ లో ముఖ్యంగా గర్భవతులు బాలింతలు చిన్న పిల్లల బాగు కోరి నాటి ప్రభుత్వాలు ఎంతో కృషితో మాతా శిశు ఆరోగ్య రక్ష ఆసుపత్రిని కట్టిస్తే ప్రస్తుతం ఈ ఎం సి హెచ్ ఆసుపత్రిలో అనేకమంది గర్భవతులు తమ కాన్పు పోసుకోవడానికి జిల్లాలో అనేక గ్రామాల ఎల్లలు పట్టణాల గల్లీలు దాటి మాకు తాండూర్ ఎంసీఎచ్ వచ్చింది మాకు భయం లేదు మా డాక్టర్లు మమ్మల్ని కంటికి రెప్పల కాపాడుకుంటారని అనేకమంది గర్భవతులు అక్కడున్న డాక్టర్లు సిబ్బందిపై నమ్మకంతో ఆసుపత్రికి చేరుకుంటారు. ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతోనే ఆసుపత్రిని నిర్మించింది ఇది జిల్లాలోనే ఏకైక ఆసుపత్రి ఎంసీఏచ్. కానీ అక్కడున్న సిబ్బంది డాక్టర్లు గత కొంతకాలంగా నిర్లక్ష్య వైఖరితో వారిని నమ్ముకుని వస్తున్న గర్భవతుల పట్ల నిర్లక్ష్య వైఖరితో వారిని పట్టించుకోకుండా వారి బాధలకు చివరకు కాన్పుకని వస్తే కనుక్కున్న తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిలిస్తూ వస్తున్నారు అక్కడి సిబ్బంది. గర్భవతి తో ఉన్న ఆడపిల్లను భారతదేశంలో ఎంత గొప్పగా వర్ణిస్తారో వీరందరికీ తెలియనిది కాదు. కానీ నిర్లక్ష్యమా! ఉద్యోగ అహంభావమా !తెలియదు కానీ నిండు ప్రాణాలతో అడ్డుకుంటున్నారని అనేక సందర్భాలలో ప్రజా సంఘాలతో పాటు ప్రతిపక్ష వామపక్ష అధికారపక్ష పార్టీలు కూడా వారి నిర్లక్ష్యానికి గురై చనిపోయిన బాలింతల కుటుంబాలకు బాసటగా నిలిచి నిరసనలు ధర్నాలు ఆందోళనలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాను రాను ఎం సి హెచ్ ఆసుపత్రి కూడా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటను మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లే వారికి గుర్తుకు తెస్తున్నట్లు అనిపిస్తున్నది ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే.

–ఎమ్మెల్యేలు కలెక్టర్లు వచ్చి పద్ధతి మార్చుకోవాలని సూచించిన మార్పు రాదా?
గత ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా సందర్శించి మొట్టికాయలు వేసిన సిబ్బంది తీరు మారడం లేదనేది బాధ్యతుల నుండి ప్రజాసంఘాల కుల సంఘాల నుండి వినిపిస్తున్నమాట, చివరికి అనేక సందర్భాలలో జిల్లా కలెక్టర్లు వచ్చి కూడా గర్భవతులు బాలింతలు పిల్లల పట్ల అమర్యాదగా కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచనలు ఆదేశాలు ఇచ్చినా కూడా అదే పరిస్థితి నెలకొంటున్నదని ప్రజా సంఘాలు మండిపడ్డాయి.
–మృతి చెందిన బాలింత రజిత కుటుంబాన్ని ఆదుకోవాలి ,బాధ్యులైన డాక్టర్లు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి, కే ఎన్ పి ఎస్, ఎమ్మార్పీఎస్ సి సి ఐ టి య, పి డి ఎస్ యు సంఘాల డిమాండ్,
ఈ సందర్భంగా నే సోమవారం రోజు తాండూర్ అంబేద్కర్ చౌక్ నిన్న! జరిగిన ఘటనపై సి ఐ టి యు, పి డి ఎస్ యు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, కుల నిర్మూలన పోరాట సమితి, ఇలా జరుగుతున్న వరుస ఘటనలపై ఆసుపత్రి తీరు వ్యవహారంపై ఘాటుగా మండిపడ్డాయి.

కోటపల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన రజిత అనే బాలింత మృతికి కారకులైన డాక్టర్లపై సిబ్బందిపై తగిన చర్యలు చేపట్టాలని సంఘాలు గట్టిగా డిమాండ్ చేశాయి. ఆమె కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కూడా పేర్కొన్నాయి. మృత్యువాత పడుతున్న బాలింతల పట్ల అప్పటి పూర్తికి ఏదో చేస్తామని సద్దుమణిస్తూ మళ్లీ అదే ఘటనాలకు పాల్పడుతున్నారని ఆరోపించాయి.
–పటిష్టమైన చర్యలు తీసుకోవాలి బాలింతల శిశువు మరణాలు సమాజానికి మంచిది కాదు,
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నాలని డిమాండ్ చేశాయి. ఇంత పెద్ద ఎంసీఎచ్ ఆసుపత్రి బాలింతల కోసం గర్భవతుల కోసం చిన్నపిల్లల కోసం నిర్మిస్తే ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతున్నదని ప్రజాసంఘాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. అక్కడి డాక్టర్లను సిబ్బందిని దేవుళ్ళుగా నమ్ముకుని మారుమూల పల్లెల నుండి పట్టణాల వరకు పేద ప్రజలు నిరంతరం వస్తూనే ఉంటారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ప్రభుత్వ దవాఖానా లో సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఉందో జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతున్నదని పేర్కొన్నాయి. ఎం సి హెచ్ తీరు ఎప్పుడు మారుతుంది ఇక మారదా? ఇలా గర్భవతులు చిన్నపిల్లలు కాటికి పోవాల్సిందేనా? నూరేళ్లు బతకాల్సిన నిండు జీవితాలు మట్టిపాలు కావాల్సిందేనా? ప్రజల చేత కడుతున్న పన్నుల ద్వారా వేల కొద్ది జీతాలు తీసుకుంటూ ఇంత నిర్లక్ష్యానికి గురిచేయడం న్యాయమేనా? అంటూ కేఎన్ పిస్ అగ్రనేత కే చంద్రప్ప సిఐటియు శ్రీనివాస్ పి డి ఎస్ యు శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా సీనియర్ నేత పి ఆనంద్ కుమార్ లాంటి నేతలు ఎం సి హెచ్ లో జరుగుతున్న ఘటనలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చనిపోయిన బాలింత రజిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన సిబ్బందిపై డాక్టర్లపై స్థానిక ఎమ్మెల్యే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని. చాలా రోజులుగా ఆసుపత్రిలో పని చేస్తున్నటువంటి సిబ్బందిని తక్షణమే ఇక్కడి నుండి బదిలీ చేయాలని ప్రజా సంఘాల నేతలు గట్టిగా కోరాయి.
