నేర వార్తలు,
హిందు 9న్యూస్, 27/3/2026:

____రద్దీ ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులు సంచరించిన సమాచారం ఇవ్వండి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్,
వికారాబాద్ జిల్లాలో సెల్ఫోన్ దొంగల ముఠా గుట్టురట్టు చేసి వారి నుండి 25 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వికారాబాద్ జిల్లా సిసిఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్ తెలిపారు…..
వికారాబాద్ జిల్లా : వికారాబాద్ జిల్లాలో గత కొంతకాలంగా రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ లాంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఖరీదైన సెల్ఫోన్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతున్న సెల్ఫోన్ దొంగల ముఠాను జిల్లా సిసిఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్, టౌన్ ఇంస్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అరెస్టు చేసింది.
జిల్లాలోని బొమ్మ రాస్పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సెల్ఫోన్ల దొంగతనాల కేసులపై జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహమెహ్రా ఆదేశాల మేరకు సిసిఎస్ బృందం సీసీటీవీ ఫుటేజ్ టెక్నాలజీ లాంటి ఆధారాలను సేకరించి నిందితుల కదలికలపై గట్టిగా నిఘా ఏర్పాటు చేసి దొంగతనాలకు పాల్పడుతున్న “కే రవి అలియాస్ గౌరీ “డోన్ మండలం కర్నూలు జిల్లా కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది సిసిఎస్ పోలీస్ బృందం.
విచారణలో నిందితుడు తనతో పాటు మరో ఐదుగురు పెద్ద వ్యక్తులు మరో ముగ్గురు చిన్న మైనర్ బాలురు ఉన్నారని వారి సహాయంతో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాకుండా జిల్లాలో ఇతర ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నట్లు సిసిఎస్ విచారణలో వెల్లడించాడు రవి.

ఈ ముఠా సభ్యులు ఆటోల పై బైక్లపై తిరుగుతూ రద్దీ మార్కెట్ ప్రాంతాలలో ఈ చోరీలకు పాల్పడే వారని పోలీసులు చెప్పుకొచ్చారు.
ప్రజలు కూరగాయలు కొనుగోలు చేస్తూ అప్రమత్తంగా లేని సమయంలో మైనర్ బాలులతో దొంగతనాలు చేయించేవారని అనంతరం సెల్ఫోన్లను వెంటనే ముఠా సభ్యుల మధ్య మార్చుకుంటూ ఆధారాలు లేకుండా చేయడం వీరి ప్రత్యేకత అని పోలీసులు గుర్తించారు.
సిసిఎస్ పోలీసులు వికారాబాద్ టౌన్ పోలీసులు సంయుక్తంగా నిందితులు ఎక్కడైతే అద్దెకు తీసుకున్న నివాస ప్రాంతాలలో ఉంటున్నారు అక్కడ సోదాలు నిర్వహించి మొత్తం 25 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సిసిఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్ తెలిపారు.
ఈ కేసులో రవి ఆలియాస్ గౌరీ, బి మహేష్ ,ఆకుల కార్తీక్ వడ్డే మురళి, వడ్డే వెంకటేష్, సంపంగి తిరుపతి, లను నిందితులుగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.
____ఎటువంటి అనుమానిత వ్యక్తులు తిరిగిన పోలీసులకు సమాచారం ఇవ్వండి,
ప్రజలు కూడా రద్దీప్రాంతాలలో తిరిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఖరీదైన మొబైల్ ఫోన్ లను జాగ్రత్తగా దాచుకోవాలని ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు సంచరించిన వారిని గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం చేరవేయాలని సిసిఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్ చెప్పారు.
సెల్ఫోన్ దొంగతనాలు చేయడం చిన్న చిన్న నేరాలు కావని వీటిపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ మూట పట్టుబడడంలో కీలకంగా వ్యవహరించిన సిసిఎస్ టీం ,వికారాబాద్ పిఎస్ టీం, సిబ్బందిని అభినందిస్తున్నామని ఇట్టి నేరస్తులు అందరు పాత నేరస్తులే వారిపైన వివిధ పోలీస్ స్టేషన్లో పలు కేసులు కూడా ఉన్నాయని సిసిఎస్పెక్టర్ తెలిపారు.
వీరి వద్ద నుండి బొొంరాస్రా పేట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల సెల్ఫోన్స్ తో పాటు సుమారు ,3,(మూడు లక్షల) 75, వేల రూపాయల విలువ కలిగిన సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ పిసిలు రాజు రామకృష్ణ రవీందర్ రమేష్ మునిరాజులు తదితరులు పాల్గొన్నారు.
