ఉద్యమ వార్తలు
K, Yadaiah |August 18,2025,

ఆగస్టు 24న ఆపరేషన్ కగారకు వ్యతిరేకంగా వరంగల్ హనుమకొండ లో జరిగే పోస్టర్ ఆవిష్కరణ సభను సోమవారం వికారాబాద్లో ఆవిష్కరించారు.
వికారాబాద్ /హిందు 9 న్యూస్ :ఆగస్టు 24న హనుమకొండలో ఆపరేషన్ కగార్ ఆపాలని కోరుతూ ఆదివాసి హక్కుల సంఘీభావ పోరాటవేదిక ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని సోమవారం రోజు వికారాబాద్ పట్టణ కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేశారు.
మధ్య భారత దేశంలో ఆదివాసుల యొక్క అత్యాకాండను నిరసిస్తూ ఆపరేషన్ కగార్ నిలిపివేసి తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని, 1/70, అటవీ హక్కుల పరిరక్షణ చట్టం అమలుపరచాలని కొరుతూ ఈ యొక్క సభ నిర్వహించబోతున్నట్లు తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా కన్వీనర్ నాగభూషణం తెలిపారు. ఈ బహిరంగ సభకు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ధ్యాసం వినయ్ భాస్కర్ సోనీ సూరి బేలాబాటియా రమణ లక్ష్మయ్య గూడెం గణేష్, పౌర హక్కుల సంఘం నాయకులు గడ్డం లక్ష్మణ్ నారాయణరావు ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ నరసింహారెడ్డి ప్రొఫెసర్ కె వెంకట్ నారాయణ, knps ,అధ్యక్షులు అభినవ్, వామపక్ష నాయకులు జాన్ వెస్లీ ,చలపతిరావు, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, పోటు రంగారావు, ప్రభాకర్, విశ్వనాథ్, తదితరులు పాల్గొననున్నట్లు వారు పేర్కొన్నారు. కస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాగభూషణం బంటు కృష్ణ కాంగ్రెస్ ,శ్రీకాంత్ అశోక్ బిఆర్ఎస్ నాయకులు, మురళి కృష్ణయ్య గౌడ్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
