ముఖ్యాంశాలు,
Kura Yadaiah/ February 22,2026,
హిందు 9 న్యూస్ :

ఎన్నో ఏండ్ల కల నాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇంటితో నా కల నేటితో నెరవేరిందని పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి గణేష్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు…..
హిందు 9 న్యూస్ (పెద్దేముల్ 22,) : ఎన్నో ఏళ్లుగా ఓ మంచి ఇల్లు కట్టుకోవాలని కలలు కన్నామని ఆ కలలు నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇందిరమ్మ ఇంటి తో మా కల నెరవేరిందని పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి గణేష్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు.
ఆదివారం రోజు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాన్ని చేసిన దంపతులు ఈ సందర్భంగా తమ ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తపరిచారు.
పూర్వీకులు నిర్మించిన ఇంట్లోనే ఎన్ని రోజులు ఉన్నామని ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని చాలాసార్లు అనుకున్నాము కానీ నెరవేరలేదని ప్రస్తుతం ఇందిరమ్మ ఇంటితో నెరవేరినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ తో పాటుగా పెద్దేముల్ మండల కేంద్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు గణేష్ దంపతులు పేర్కొన్నారు.
ఇంకా గ్రామానికి కావలసిన ఇందిరమ్మ ఇళ్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో మంజూరు చేసుకోవడానికి ప్రయత్నిస్తామని స్థానిక నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ కన్వీనర్ రియాజ్, తారాబాయి ధారా సింగ్, పడగళ్ల బుజ్జమ్మ గ్రామ కమిటీ అధ్యక్షుడు డివై నర్సింలు ఎర్రబాలప్ప ప్రధాన కార్యదర్శి ఎండి ఫయాజ్ కోహిర్ గోపాలకృష్ణ సయ్యద్ షబ్బీర్ సునీల్ జాదవ్ వార్డు సభ్యులు నయీం బేగరీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
