తలారి సాయప్ప ను గెలిపిస్తే కాలనీని అన్ని హంగులతో అభివృద్ధి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,

ముఖ్యాంశాలు 

Kura yadaiah| February 7,2026;

హిందు 9న్యూస్ బ్యూరో ;

Mla Tandur| ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తలారి సాయప్పను గెలిపిస్తే కాలనీని హనీ హంగులతో అభివృద్ధి చేసుకుందామని తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు……

హిందు 9న్యూస్ (తాండూర్ 7,)8, వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తలారి సాయప్ప ను గెలిపించాలని తాండూర్ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తూ చైర్మన్ పదవి తప్పకుండా కైవసం చేసుకుంటున్నామని తలారి సాయప్ప ను గెలిపిస్తే కాలనీని అన్ని అంగులతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.

శనివారం రోజు రాజీవ్ గృహ కల్పా  లోని 8, వార్డులో ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తలారి సాయప్ప కు మద్దతుగా డిసిసి అధ్యక్షులు ధారాసింగ్, కాంగ్రెస్ నాయకులు ముజీబ్ ఖాన్ , రావూఫ్ లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజీవ్ గృహకల్ప ఇందిరమ్మ కాలనీ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ కాలనీని ఏర్పాటు చేసుకోవడం పేదల కోసం దూర దృష్టితో ఆరోజు ప్రభుత్వం ఆలోచించడంతో పేద మధ్యతరగతి వర్గాలకు మంచి వసతి గృహాలు లభించాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత దూర దృష్టి ఉంటుందో ఈరోజు ఈ కాలనీ చూస్తే అర్థమవుతుందని ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనను ఆ పార్టీ విధివిధానాలను సమైక్యత భావాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇంత పెద్ద కాలనీని ఆనాటి ప్రభుత్వం నిర్మించడం ఎంత గొప్ప విషయమో ఇక్కడి ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద మధ్యతరగతి ప్రజల అభిష్టం మేరకు నడుచుకునే ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం నేటి ప్రభుత్వంలో అందిందని తెలిపారు.  మళ్లీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలనీని అన్ని హంగులతో అభివృద్ధి చేసుకుందామని ఆ దృష్టితోనే ఇక్కడి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తలారి సాయప్పకు ఓటేసి ఆదరించి కాలనీ అభివృద్ధికి దోహదపడాలని కోరారు. తప్పకుండా కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరించుకొని ఒక మంచి వార్డుగా అభివృద్ధి చేసుకోవడం మనందరి బాధ్యతగా తీసుకోవాలంటే అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థి సాయప్పను గెలిపించాలని ప్రజలను మరోసారి కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *