ముఖ్యాంశాలు
Kura Yadaiah| February 6,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో ;


-కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాండూర్ మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు!
-అంతా రోహిత్ రెడ్డి హయాంలో నే అభివృద్ధి!
-తులం బంగారం ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వలేదంటూ నాతో ప్రజలు వాపోయారు,
-11వ వార్డులో మా రాజేష్ అధిక మెజార్టీతో గెలుపొందుతారు, బిఆర్ఎస్ మహిళా నేత ప్రమోదినీ రెడ్డి,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాండూర్ మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అంతా రోహిత్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగినట్లు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడి ప్రజలు తమతో చెప్పుకొచ్చారని బిఆర్ఎస్ మహిళా నేత ప్రమోదినీ రెడ్డి అన్నారు…..
హిందు 9 న్యూస్( తాండూర్ 6) ; కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాండూర్ మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఎలాంటి అభివృద్ధి జరగలేదని స్థానిక ప్రజలు ప్రచారంలో భాగంగా నేను వెళ్ళినప్పుడు ప్రజలు ఈ విధంగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని ప్రమోదిని రెడ్డి అన్నారు. శుక్రవారం రోజు 11 వ వార్డు బిఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి అవుసుల రాజేష్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మీడియా ముందు ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యంగా చదువుకున్న ఆడపిల్లల వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అడిగితే ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం ఇప్పటివరకు ఇవ్వలేదని ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని వాటిని కూడా ఇక్కడ ఎవరికి ఇచ్చినట్లు దాఖలాలు లేవని తమతో మహిళలు ఆడపిల్లలు ఇలా చెప్పుకొచ్చారని ఆమె అన్నారు.
తాండూరులో గత ప్రభుత్వంలో రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధే తప్ప ఈ వార్డులో ప్రస్తుత ప్రభుత్వం చేసింది ఏమీ లేదని వార్డుల ప్రచారంలో తమతో ప్రజలు వాపోయారని పేర్కొన్నారు. రైతుబంధు సక్రమంగా జరగలేదని రైతు బీమా పథకం కూడా అంతంత మాత్రమే తప్ప ఎక్కడ సరిగ్గా అమలైన దాఖలాలు కనిపించడం లేదని ఆమె ఆరోపణలు చేశారు. నేను ఇప్పటికే దాదాపుగా 10 నుంచి 11 వార్డులు గడపగడపకు వెళ్లి ప్రచారం చేశాను ఎక్కడ కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ప్రజల్లో వాతావరణం కనిపించడం లేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.కాంగ్రెస్ పై వ్యతిరేకత చూపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఆశాజనకంగా కనిపించడం లేదని అనుకొచ్చారు.
11వ వార్డులో మా రాజేష్ అధిక మెజార్టీతో గెలవబోతున్నారు,
11వ వార్డులో రాజేష్ కు పోటీగా నిలబడుతున్న వ్యక్తిపై అనేక వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయని ఆమె ఆరోపణ చేశారు. మా రాజేష్ భారీ మెజార్టీతో గెలుస్తారని చైర్మన్ అభ్యర్థి పొట్లోళ్ల నర్సింలు నాయకత్వంలో తాండూర్ మున్సిపల్ అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు. తప్పకుండా 11వ వార్డులో ఉన్న ప్రజలు యువకుడు ఉత్సాహవంతులు రాజేష్ కు ఓటేసి బిఆర్ఎస్ ను గెలిపిస్తారని నాకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. మరోసారి 11 వ వార్డులో BRS నుండి తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీకి తలపడుతున్న అవుసుల రాజేష్ కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు శకుంతల పాటు ఇతర నాయకులు యువకులు పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
