ముఖ్యాంశాలు
Kura Yadaiah/ January 30,2026,
హిందు 9 న్యూస్ బ్యూరో :-

Sriram Life insurance| తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభవంతులైన విద్యార్థులకు వారి ప్రతిభను గుర్తించాలని ఉద్దేశంతో విద్యార్థులను ఉన్నతమైన చదువుల కోసం ప్రోత్సహించాలనే ఆలోచనతో పదవ తరగతి టాపర్లకు 2.2 కోట్లను నగదు బహుమతులుగా ఇవ్వడానికి నిర్ణయించింది….
హిందు 9 న్యూస్ (హైదరాబాద్) :తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతిభవంతులైన విద్యార్థులను వారి ప్రతిభను గుర్తించాలనే ఉద్దేశంతో విద్యార్థులను ప్రోత్సహించాలనా ఆలోచనతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ 2.2 కోట్ల రూపాయలను 10వ తరగతిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించింది.
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బహుమతుల ప్రకటన,
ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్రస్థాయి స్టేట్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి 5, లక్షలు, 2, స్థానం వచ్చిన విద్యార్థికి 3, లక్షలు కాగా ప్రతి జిల్లా టాపర్ కు రెండు లక్షల చొప్పున ప్రతి నియోజకవర్గ టాపర్లకు 1 లక్ష చొప్పున 612 మండలాలలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి పదివేల నగదు అందజేస్తున్నట్టు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. ఈ బహుమతులకు గాను వాల్ పోస్టర్ను హైదరాబాద్ పాఠశాల విద్య సంచాలకులు డాక్టర్ ఈ నవీన్ నికోల తో కలిసి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు విడుదల చేశారు.
