రాజకీయాలు, వీశ్లేషణ
Kura Yadaiah|August 12,2025

బీసీ కులాలకు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తో పాటు విద్య ఉద్యోగాలలో42% రిజర్వేషన్ కల్పిస్తామని గత 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా పెట్టుకుంది. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్, విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇలా రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింప చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.
Reding ,
Bc reservation| అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల పదవీకాలం ముగియడంతో తిరిగి స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సి ఉండగా అది సాధ్యపడలేదు. బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచుతామన్న గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు కదిపింది.హామీని నిలబెట్టుకున్నాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
అనుకున్నట్లుగానే రాష్ట్రంలో కుల గణన సర్వే తో పాటు ఆర్థిక, విద్య, ఉద్యోగ సర్వేలను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టింది. బీసీ జనాభా 56% ఉన్నట్లు గణాకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టింది.
కుల గణన ఆధారంగానే, సుప్రీంకోర్టు నిబంధన కనుగుణంగా ప్రభుత్వం శాస్త్రీయబద్ధంగా న్యాయబద్ధంగా ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా రిజర్వేషన్స్ ఉండాలని భావించింది. అలా అసెంబ్లీని ఏర్పాటు చేసి అన్ని పార్టీల అభిప్రాయం సహకారంతో రెండు బిల్లులను తీసుకొచ్చింది.1, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పాటు, 2, విద్య, ఉద్యోగాలలో కూడా అదే రిజర్వేషన్ ఇవ్వాలని బిల్లును ఇరుసభలలో ఆమోదింప చేసుకుని రాష్ట్ర గవర్నర్కు పంపి కేంద్ర ప్రభుత్వానికి ఆ బిల్లును పంపి కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామంటూ బీసీ సమాజానికి తెలంగాణ రాజకీయ పక్షాలకు నిరూపించుుంది.
కేంద్రానికి బీసీ రిజర్వేషన్ బిల్లు పంపి బంతి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. మాది ఏం లేదు, బిజెపి బీసీల పట్ల ఆ పార్టీ చిత్తశుద్ధి చాటుకోవాలని బీసీ రిజర్వేషన్ల పట్ల బిజెపికి ఉన్న వైఖరి చెప్పాలని బిజెపి పై ఆరోపణలకు దిగింది.
బిజెపి మాత్రం ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని చెప్పండి ముస్లింలకు రిజర్వేషన్లు ఏంటని బిజెపి అధికార కాంగ్రెస్ ను ప్రశ్నిస్తూనే ముస్లింలకు రిజర్వేషన్ కుదరదు అని చెప్పితే బిసి రిజర్వేషన్ బిల్లు ఆమోదించడం పెద్ద పని కాదన్నట్లుగా బిజెపి చెప్పుకొచ్చింది.
బీసీల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఇది అంటూ బిజెపి పార్టీని బీసీల్లో పట్టు కోల్పోయే విధంగా ఒక రాజకీయ ఎత్తుగడగా కాంగ్రెస్ పార్టీ బిజెపిని ఇరుకున పెట్టింది.
అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిధిని మేము ఎప్పుడు దాటేశామని కాంగ్రెస్ చెప్పుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇటీవల బిజెపి పార్టీని మరింత ఎరుకున్న పెట్టే విధంగా ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీసీ రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్ ఎంత ప్రయత్నాలు చేసినా ఎన్ని ధర్నా కార్యక్రమాలు చేసిన కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నదని బిజెపి పార్టీని బిసి వర్గాలలో తక్కువగా చూపెట్టి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
చివరికి మేము ఢిల్లీలో కూడా బీసీ రిజర్వేషన్ల పట్ల పోరాటం చేశామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన అంశంగా కులగణన ,ధర్నా కార్యక్రమం లాంటివి ఆ పార్టీ అస్త్రాలు గా మిగిలాయి.
బిజెపి బిఆర్ ఎస్ విమర్శనాస్త్రాలు,
కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ పట్ల ధర్నా పేరుతో డ్రామలాడుతుందని బిజెపి విమర్శించే ప్రయత్నాం చేసింది.
బిజెపి కాంగ్రెస్ ఒకటేనంటూ ఇదంతా కూడా ఒక డ్రామాగా ఉందంటూ వర్ణిస్తూ బిఆర్ఎస్ నేతహరీష్ రావు ఆరోపణలు కూడా చేశారు.
కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లుకు ఆమోదం తెలుపకపోతే?
కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపకపోతే ?తెలంగాణలో ప్రభుత్వం ముందు గత రిజర్వేషన్లను కొనసాగిస్తూ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందేమో అనే అంచనాకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది . 23% కంటే 42 శాతం ప్రధానంగా బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాలలో రెండు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భాగించింది. కానీ అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం.
అయితే కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్ట పోతుందా అంటే పార్టీ వర్గాలో విశ్లేషకుల్లో అవుననే సమాధానం వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీపరంగా రిజర్వేషన్స్ ఇవ్వాలనే ఆలోచనకు వస్తుందనే సందేహాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే మిగతా పార్టీలు అంటే బి ఆర్ ఎస్ ,బిజెపి పార్టీలు తమ వైఖరి బీసీలకు చెప్పాల్సి రావడమే కీలకంగా కనిపిస్తున్న అంశమే. రిజర్వేషన్ పట్ల మి మి పార్టీల వైఖరి ఏంటో చెప్పాలనే డిమాండ్ ను ప్రజల ముందు కాంగ్రెస్ పెట్టనుంది. ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు ప్రధాన అంశంగా ఉంటాయనేది స్పష్టంగా అర్థమవుతున్న అంశమే.
తెలంగాణ హై కోర్టు సెప్టెంబర్ 30 తారీకు లోపు ఎన్నికలు జరపాలని గడువు కూడా మరోపక్క ముంచుకొస్తున్న అంశమే, కోర్టు నిర్ణయించిన గడువులోపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపాల్సి రావడం విధితమే.
బీసీ రిజర్వేషన్ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి చెప్పనుందా? బిజెపి బిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ మాదిరిగానే పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అవకాశం కల్పించబోతాయా? లేక సొంత ఎజడాతో ముందుకెళ్తాయా? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరగబోతుందో !రాజకీయంగా బీసీ రిజర్వేషన్ అంశం కీలకంగా మారబోతుంది.
