ఆందోళన,
Kura Yadaiah |November 17, 2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-


Incidence|విచారణ పేరుతో మంబాపూర్ గ్రామానికి చెందిన ఫేరోజ్ అకారణంగా చితకబాది కొట్టిన పెద్దేముల్ ఎస్సై వారికి సహకరించిన కానిస్టేబుల్ లను తక్షణమే సస్పెండ్ చేయాలని పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు……
Incidence| పెద్దేముల్: విచారణ పేరుతో అకారణంగా ఫేరోజ్ ను చితకబాదిన పెద్దేముల్ ఎస్సైని వారికి సహకరించిన కానిస్టేబుల్ లను తక్షణమే సస్పెండ్ చేయాలని సోమవారం రోజు పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫెరోజ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం దాదాపు మూడు నెలల క్రితం మంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ మృతికి సంబంధించి నిన్ను విచారించాలని ఆదివారం సాయంత్రం పెద్దేముల్ ఎస్సై వేణు కుమార్ ఫెరోజ్ ను ఫోన్ చేసి పీల్చుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో ఫెరోజ్ పెద్దేముల్ పోలీస్ స్టేషన్కు రమ్మన్నారని కుటుంబ సభ్యులకు తెలిపి పోలీస్ స్టేషన్ కు వెళుతున్నట్లు తమకు చెప్పి వచ్చారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇదే విషయమై ఎస్సై తో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు ఫేరోజ్ ను లోపలికి పిలిచి గత మూడు నెలల క్రితం చనిపోయిన మీ మామ గౌస్ ను నీవే చంపావంటూ బెదిరింపులకు దిగినట్లు తెలిపారు. నేరాన్ని ఒప్పుకోవాలంటూ బలవంత పెట్టి నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఎంతగా ప్రాధేయపడిన ఎస్సై వినకుండా విచక్షణ రహితంగా తోటి కానిస్టేబుల్ ల సాయంతో ఫెరోజ్ ను ఇష్టానుసారంగా కొట్టారని కుటుంబ సభ్యులు వాపోయారు. ఫెరోజ్ శరీరం పైన తీవ్ర గాయాలు ఉన్నందున చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి దృశ్యం

ప్రస్తుతం ఫెరోజ్ చికిత్స పొందుతున్నాడని కోల్కొవడానికి చాలా సమయం పడుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే నా భర్త మృతికి సంబంధించి నేను ఎలాంటి ఫిర్యాదు కూడా చేయలేమని ఇలా కొట్టడం ఏంటని జరిగిన విషయాన్ని తెలుసుకొని హుటాహుటిన పెద్దేముల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీఐ నాగేష్ ముందు బాధితుడి కుటుంబ సభ్యులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు.
నా భర్త చావుకు కారణమైన నిందితులను పట్టుకొని శిక్షించండి,
అంతేకాకుండా నా భర్త చావుకు కారకులెవరు విచారించి నిందితులను పట్టుకుని తక్షణమే శిక్షించాలని సిఐ నాగేష్ కు ఆవేదనగా విన్నవించారు. ఒకవేళ ఎస్సైని కానిస్టేబుల్ లను సస్పెండ్ చేయకపోతే ఎస్పీని సంప్రదిస్తామని అప్పటికి స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఫిరోజ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
తాండూర్ రూరల్ సిఐ నాగేష్ వివరణ,
పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామానికి సంబంధించి ఓ అనుమానాస్పద మృతికి చెందిన కేసు విషయంలో విచారణ నిమిత్తం ఎస్ఐ వేణు కుమార్ ఫెరోజ్ ను పోలీస్ స్టేషన్ కు రప్పించారని దానికి సంబంధించి తనపై థర్డ్ డిగ్రీ ప్రదర్శించినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తమకు ఫిర్యాదు చేశారని సిఐ తెలిపారు. బాధితుడు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తమకు తెలపడంతో బాధితుడితో కూడా నేను మాట్లాడానని సిఐ తెలిపారు. అయితే వారి ఫిర్యాదు మేరకు తగిన విచారణ జరిపి ఈ ఘటనకు బాధ్యులైన వ్యక్తుల పైన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ నాగేష్ పేర్కొన్నారు.
