జన్మదినం,
Kura Yadaiah September 23,2025,


P, Mahindr Reddy| ఘనంగా ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ జన్మదిన వేడుకలు హైదరాబాదులోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించుకున్మనారు మహేందర్ రెడ్డి అభిమానులతో కలిసి తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రి నందు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బిర్కట్ రఘు ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు…..
Mahendr Reddy| హైదరాబాద్: ప్రభుత్వ చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులతో కలిపి అభిమానుల మధ్య వేదమంత్రాలతో మంగళవారం రోజు హైదరాబాదులోని తన నివాసంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ జన్మ దిన వేడుకల్లో సునీత మహేందర్ రెడ్డి , వారి కుమారుడు రినిష్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని కేక్ కట్ చేసి మహేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేద పండితుల మధ్య మహేందర్ రెడ్డి దంపతులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.


*తాండూరు లో మహేందర్ రెడ్డి జన్మదినం జోరు
మహేందర్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని తాండూర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బిర్కట్ రఘు నేతృత్వంలో పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో తాండూర్ పట్టణానికి చెందిన 26 మంది యువకులు రక్తదానం చేసి అటు సామాజికంగా ఇటు అభిమానంగా యువత మహేందర్ రెడ్డి మీద ఉన్న ప్రేమ అనురాగాలను అభిమతాన్ని చాటుకున్నారు.
ఆస్పత్రిలో ఉన్న పేషెంట్లకు అల్పాహారం పండ్లు కూడా పంపిణీ చేశారు.


కార్యక్రమంలో టిపిసిసి ప్రచార సమన్వయకర్త కర్ణం పురుషోత్తమారావు మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ గడ్డల పరిమళ ,రవీందర్ అబ్దుల్ కవి భగవాన్ పునీత్ కుమార్ శివానంద్ మడపతీ సంకేత్ సిద్దు పంతులు ఆనంద్ గౌడ్ మణికంఠ శ్రీనివాస్ కాంతు రజక కృష్ణ నరసింహ మెట్లీ వెంకట్ యువకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
