జిల్లా హోంగార్డులకు ఉలెన్ జాకెట్లు రెయిన్ కోట్లు- హోంగార్డులకు ఎలాంటి సమస్య ఎదురైనా నేరుగా నన్ను సంప్రదించవచ్చు- వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి,

చట్టం ,

Kura Yadaiah/ September 22,2025

హోంగార్డులకు ఉలెన్ జాకెట్లు రెయిన్ కోట్లు అందిస్తూ హోంగార్డులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తనను నేరుగా సంప్రదించవచ్చు అన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు…….

వికారాబాద్ :  వికారాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల సంక్షేమాన్ని వారి బాగోగులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ జనరల్ కార్యాలయం నుంచి ఉలెన్ జాకెట్లు రెయిన్ జాకెట్లును వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి పంపించిన నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి హోంగార్డులు అందరికీ ఉలెన్ జాకెట్లు రెయిన్ జాకెట్లను జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సోమవారం రోజు హోంగార్డులకు అందించారు. రాష్ట్ర పోలీస్ శాఖలోని హోంగార్డులు ఒక అంతర్భాగమని నిరంతరం వారు పోలీసులతో శాంతి భద్రతల పట్ల భుజం భుజం కలిపి సేవలందిస్తున్నారని జిల్లా ఎస్పీ కొనియాడారు. ఎండనక వాననక చలనక ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హోంగార్డులు తమ విధులు సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఈ జాకెట్లు రెయిన్ కోట్లు వారికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో వివిధ సందర్భాలలో పోలీసులకు కీలకమైన సహాయ సహకారాలు అందించడం వారి నిబద్ధతకు నిదర్శనమని ప్రశంసించారు.

ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని ట్రాఫిక్ నియంత్రణ పండుగల సమయంలో ఎన్నికల సమయంలో నిరంతరాయంగా తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. హోంగార్డులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా నేరుగా తనని సంప్రదించవచ్చని వారి సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి హామీ ఇచ్చారు.హోంగార్డుల సంక్షేమానికి పోలీసులు ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో హోంగార్డులు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *