అంబేద్కర్ ఆశయాలను అందరూ తెలుసుకోవాలి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెంకటాచారి

సామాజిక వార్తలు,

హిందు 9 న్యూస్ 14/4/2026:

  • అంబేద్కర్ బాటలో నడవాలి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ ఎంపీటీసీల పురం అధ్యక్షుడు వెంకటేష్ చారి,

పెద్దేముల్:  అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘాజీపూర్ లోని అంబేద్కర్ విగ్రహానికి తన సహచరులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అంబేద్కర్ ఆశయాలు భారత ప్రజలందరికీ మార్గదర్శకమని అంబేద్కర్ చూపిన బాటలోనే యువత నడుచుకోవాలని అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని మాజీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వెంకటేష్ చారి తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనీయులని కొనియాడారు.

 

సామాజిక అంశాలు విద్యాభివృద్ధి కోసం ఎంతో పాటు పడ్డారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న యువత అంబేద్కర్ ఆశయాలు ఆయన ఆలోచనలు తెలుసుకోవాలని భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ అభిమానులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *