కమిషన్ చర్యలు తీసుకునేనా? వికలాంగుల కమ్యూనిటీ హాల్ వికలాంగుల కు దక్కేనా?

ముఖ్యాంశాలు,

Kura Yadaiah/ March 9,2026,

హిందు 9 న్యూస్ తెలంగాణ బ్యూరో :

 

 

పెద్దేముల్( 9): 2006లో వికలాంగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని నాటి ప్రభుత్వం పెద్దెముల్ మండల్ తాసిల్దార్ కార్యాలయం పక్కన వికలాంగుల కమ్యూని హాల్ నునిర్మించింది.

వారి సంక్షేమం కోసం కమ్యూనిటీ హాల్ ను నాటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ప్రస్తుత శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. కానీ ఏ కమ్యూనిటీ కోసమైతే నిర్మించారో? ఆ వికలాంగుల కమ్యూనిటీ కి ఆ బిల్డింగులు అప్పజెప్పలేదు, దాంతో స్థానికంగా ఉన్న తాసిల్దార్ కార్యాలయానికి చెందిన క్రింది స్థాయి ఉద్యోగులు దానిని ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నారు.

మండల వికలాంగులు అధికారులను అడిగే పరిస్థితి లేకపోవడంతో, మండలానికి వికలాంగుల సమస్యలు పనుల నిమిత్తం వివిధ కార్యాలయాలకు వచ్చే వికలాంగులకు గాని లేదా వికలాంగుల సంక్షేమం అభివృద్ధి కోసం వికలాంగులు కూర్చుని చర్చించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని వికలాంగులు సంస్థల నాయకులు “డిసెంబర్” 2025 నా, రాష్ట్ర వికలాంగుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది.

కానీ ఇప్పటివరకు  సదరు కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వికలాంగుల హక్కులను ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఉందని పలువురు వికలాంగుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత జిల్లా కలెక్టర్కు ఆ బిల్డింగును వికలాంగులకు అప్పజెప్పాలని సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిన కమిషన్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బిల్డింగ్ పై ఎలాంటి చర్య తీసుకోకపోతే హైదరాబాద్ ప్రజా భవన్ లో ఫిర్యాదు చేస్తామని సంఘాల నాయకులు తెలిపారు. దాంతో పరిష్కారం కాకపోతే జిల్లా కోర్టు దృష్టికి తీసుకెళ్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *