
తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కేంద్ర మంత్రి వీరేందర్ కుమార్ ను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వయోవృద్ధులు వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్స్ శాఖ మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యలు వినతిపత్రం ఇచ్చారు……
న్యూ ఢిల్లీ :కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరేందర్ కుమార్ ను కలిసి తెలంగాణలోని వికలాంగులకు సంబంధించిన వివిధ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని వికలాంగుల సమస్యలు డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ వయోవృద్ధుల వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్స్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్పొరేషన్ చైర్మన్ ముతినేని వీరయ్య లు కలిసి వినతి పత్రం ఇచ్చారు.

వికలాంగులకు పెన్షన్ విధానాన్ని 300 నుండి 3000 వరకు పెంచాలని, వికలాంగులకు పెన్షన్ అర్హత ని 80% నుండి 40% తగ్గించాలని, బాల్యం నుంచే వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలని, డిమాండ్ చేస్తూ. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వికలాంగులకు ఇచ్చే ఉచిత పరికరాలు 40% బెంచ్ మార్క్ వైకల్యంకే ఇవ్వాలని, మంత్రికి వివరించారు.
కేంద్రం పెన్షన్ పెంచకపోతే ఆందోళన తప్పదని పెద్ద ఎత్తున వికలాంగులతో కలిసి ఉద్యమిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో చేనేత విభాగం చైర్మన్ గూడూరు శ్రీనివాస్ పేరిక కుల కార్పొరేషన్ సాధన సమితి అసోసియేట్ ప్రెసిడెంట్ కోట మల్లికార్జున రావులు తదితరులు పాల్గొన్నారు.
