వ్యవసాయం, ప్రభుత్వం,
Kura Yadaiah| September 30,2025


Cooperative society|రేపే పెద్దేముల్ మండల రైతు సేవా సహకార సంఘం సభ్యత్వ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ రైతులందరూ ఈ సమావేశంలో పాల్గొనాలని సీఈఓ మురళీధర్ తెలిపారు……
Cooperative society| పెద్దేముల్ :రేపే పెద్దేముల్ మండల రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ యొక్క సాధారణ సభ్యత్వ సమావేశం 30,9, 2025 మంగళవారం రోజు నిర్వహిస్తున్నట్లు రైతు సేవ సహకార సంఘం లిమిటెడ్ సీఈఓ జి మురళీ దర్ తెలిపారు. ఈ సమావేశం రైతు సేవా సహకార సంఘం ఆవరణలో జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
-సమావేశంలో చర్చనీ అంశాలు,
ఈ సమావేశంలో జనవరి 1, 2024 నుండి మార్చ్ 31 2025 వరకు గల వార్షిక జమ ఖర్చుల పట్టికను ఆమోదించుట,2024 నుండి 25 సంవత్సరం యొక్క ఆస్తి అప్పుల పట్టిక తోపాటు, 2025 -26 వార్షిక సంవత్సరం అంచనా బడ్జెట్ను నిర్ణయించుట ,2024 సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ ను ఆమోదించుట, 2024 -25 సంవత్సరం యొక్క సంఘం ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయుటతో పాటు పాలకవర్గం ఆరు నెలలు పొడిగింపు పై తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు మురళి గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి చైర్మన్, శ్రీనివాస్ సంగారెడ్డి మేనేజర్ హాజరవుతారని తెలిపారు. సంఘంలో సభ్యత్వంం ఉన్న రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.
