
Digital|తాండూర్:ఇటీవల హైదరాబాదులో నవ తెలంగాణ దినపత్రిక వార్షికోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడిన భాష పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ముఖ్యమంత్రి జర్నలిస్టుల పట్ల మాట్లాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నట్లు డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ తెలిపారు.
ఆదివారం రోజు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన వికారాబాద్ డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యుగేందర్ శివప్రసాద్ తో కలిసి ఈ సందర్భంగా మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా పట్ల వ్యంగ్యంగా మాట్లాడడం సరైన భాష కాదని గత ప్రభుత్వం డిజిటల్ మీడియా పట్ల ఇలానే మాట్లాడి ప్రజా ఆగ్రహానికి గురైందని అదే డిజిటల్ మీడియా ప్రసార సాధనాల ద్వారానే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం హాస్యస్పదమని తెలిపారు. రాజకీయాలలో అందరూ ఓనమాలు వచ్చిన వారే ఉన్నారా ? యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వాట్సాప్ లాంటి సోషల్ మీడియా మాకు అవసరం లేదని మీ మీ రాజకీయ పార్టీ కార్యాలయాల వద్ద బోర్డులు పెట్టండి అప్పుడు ఎవరూ రారని వ్యాఖ్యానించారు.
ఎవరో ఒక ఛానల్ వారు వచ్చిరాని భాషలో మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కానీ చేస్తే ఆ ఛానల్ లను ఆ జర్నలిస్టులను మాత్రమే విమర్శించాలి తప్ప అందర్నీ అదే కోవాలో ఎలా చూస్తారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
డిజిటల్ మీడియా జర్నలిస్టులు కూడా తమ భాషను యాసను చూసి మాట్లాడాల్సిన అవసరం ఉందని సూచించారు. రాబోయే రోజుల్లో కూడా డిజిటల్ మీడియానే అగ్రస్థానంలో ఉంటుందని ఎందుకంటే ప్రజల పక్షాన ప్రజా సమస్యల పట్ల నిరంతరం ప్రజల వద్దకు వెళ్లి పనిచేస్తున్న చానల్స్ జర్నలిస్టులు డిజిటల్ మీడియా వారేనని వాస్తవాలను ప్రజల ముందు ప్రభుత్వాల ముందు సమాజం ముందు ఉంచుతున్నామని ప్రజల మద్దతు డిజిటల్ మీడియాకు పెరుగుతుంది కాబట్టే ప్రభుత్వం భయపడుతుందని తెలిపారు. ఇప్పటికైనా డిజిటల్ మీడియాకు కూడా చట్టబద్ధత కల్పించాలని అలాగే డిజిటల్ మీడియా జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వాలని మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మూడు డిమాండ్లు ప్రధాన డిమాండ్గుగా డిజిటల్ మీడియా భావిస్తున్నదని వాటికోసం ఎందంకైనా పోరాటానికి సిద్ధమని డిజిటల్ మీడియా జర్నలిస్టులు కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని కోరారు. అనంతరం వికారాబాద్ జిల్లా డిజిటల్ మీడియా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.1, కూర యాదయ్య వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా నియమితులు కాగా, పులిమామిడి బాలరాజ్ జిల్లా అధ్యక్షులుగా, జిల్లా ఉపాధ్యక్షులుగా మాత్యరి
గణేష్,జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొడంగల్ సాయిరాజ్, సహాయ కార్యదర్శిగా నరేష్ కుమార్ కొడంగల్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా రహమత్ లను
ఎన్నుకోగా,
తాండూర్ డివిజన్ కమిటీ అధ్యక్షులుగా గణేష్, ప్రధాన కార్యదర్శిగా అఖిల్ సహాయ కార్యదర్శిగా రహమత్, లను ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు.