కార్మికులు,
K, Yadaiah|September 8,2025,
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని భారత కార్మిక సంఘాల రాష్ట్రస్థాయి సదస్సులో,pow కార్యదర్శి వై గీత పాలకులను డిమాండ్ చేశారు…..
హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ రకాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని వారిని స్కిమ్ వర్కర్ల కార్మికుల గుర్గా గుర్తించి పెర్మనెంట్ చేసి కనీస వేతల వేతనాలనాల చట్టాలను అమలుపరిచి కార్మికులకు న్యాయం చేయాలని ఆదివారం రోజు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య (iftu)ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి సదస్సులో పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై గీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి ఈ కార్యక్రమానికి వచ్చిన కేజీబీవీ ఇతర రంగాల కార్మికులు ఔట్సోర్సింగ్ రంగాలలో అత్యధికంగా మహిళల శ్రమశక్తి దోచుకోబడుతున్నదని అమే అన్నారు.
ఒకే దేశం ఒకే విధానం వివిధ రంగాలలో సంస్కరణలు కోరుకునేవారు దేశంలో శ్రామిక వర్గానికి గౌరవప్రదమైనటువంటి వేతనాలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. దేశంలో శ్రామిక వర్గాన్ని గౌరవించి గౌరవపదమైన వేతనాలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదా అని ఆమె ప్రశ్నించారు. కార్పొరేట్ల మీద ఉన్న ప్రేమ భారత కార్మిక వర్గాల మీద శ్రామిక జనజీవనం మీద భారత ప్రభుత్వానికి ఎందుకు లేదో చెప్పాలని నిలదీశారు. భారత కార్మిక వర్గాలు శ్రామిక జనం మీద అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజలను ఇట్టి మరిచిపోతున్నాయని నియత్ అనేది ఒకటి ఉండాలని అది పాలకవర్గాలకు ఉన్నట్లు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.