మతం ,
K, Yadaiah/September 5,2025
మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మంబాపూర్ లో ముస్లిం మైనార్టీలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు…..
హిందు 9 న్యూస్ / పెద్దేముల్: మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా మంబాపూర్ లో శుక్రవారం రోజు ముస్లిం మైనార్టీలు రక్తదాన శిబిరం నిర్వహించారు. ముస్లిం యూత్ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్ ఉపాధ్యక్షుడు కచ్చి ఆయాజ్ ఆధ్వర్యంలో ఆయుష్ బ్లడ్ బ్యాంక్ తాండూర్ కు చెందిన ముస్లిం మైనార్టీ చెందిన 30 మంది యువకులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నట్లు సయ్యద్ ఇమ్రాన్, సయ్యద్ ఆయాజ్ తెలిపారు. యువకులు సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుండాలని యువకుల వల్ల సమాజం యొక్క స్థితిగతులు మారుతాయని సమాజ పోకడలు యువత పోకడలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల దేశం పట్ల రాష్ట్రం పట్ల దేశ సమైక్యత పట్ల సోదర భావం పెంపొందుతుందని తెలిపారు.
కార్యక్రమంలో జామా మజీద్ అధ్యక్షులు ఎండి ముజీబ్ ఎండి మైపూస్ ఎండి ఖలీల్ షేక్ మైనుద్దీన్ సయ్యద్ ఇబ్రహీం పెరోజ్ సయ్యద్ మహమ్మదీస్ ఎండి గౌస్ ఎండి సోఫీ షేక్ మైనుద్దీన్ ఎండి ఖలీల్ మజీద్ ఎండిస్ బషీర్ ఎండి ఖలీల్ ఖలీల్ విజయ్ కుమార్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.