పండుగ,
K, Yadaiah/ September 4,2025,
రేగొండిలో గురువారం రోజు శాంతి సామరస్య సాంప్రదాయాలతో వినాయకుల నిమజ్జనాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు……
హిందు 9 న్యూస్/ పెద్దేముల్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రేగొండి గ్రామంలో తొమ్మిది రోజులకు వినాయకుని నిమజ్జనాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. గురువారం రోజు గ్రామంలోని హనుమాన్ దేవాలయం నందు ఏర్పాటుచేసిన వినాయకుడి లడ్డు వేలం పాటలో 30, వేలకు అదే గ్రామానికి చెందిన పుల్లామొళ్ళ నర్సింలు వినాయకుని లడ్డును దక్కించుకున్నట్లు భక్తులు తెలిపారు.
మొదటిసారిగా ఈ లడ్డు భారీగా వేలంపాట పలకడం ఇదే మొదటి సారి అని స్థానిక భక్తులు తెలిపారు. అనంతరం గ్రామంలో వేరు వేరు స్థలాలలో ఏర్పాటుచేసిన గణనాథులను భక్తులు శాంతి సామరస్య, సాంప్రదాయలతో భక్తులు ఆటపాటలతో ఆనందోత్సవాల మధ్య ఊరేగింపు గా భక్తులు అందరూ కలిసిమెలిసి సామరస్య పూర్వకంగా భక్తిశ్రద్ధలతో వినాయకులను నిమజ్జనం చేశారు.
-వినాయక చవితి పండగ అంటే ఏమిటి?
వినాయక చవితి పండగ అంటే పార్వతి పరమేశ్వరుడికి పుట్టిన బిడ్డగా వినాయకుని పుట్టినరోజుగా ఈ పండుగను జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. వినాయకుడు అడ్డంకులను తొలగించేవాడుగా కొత్త ప్రారంభాలకు మార్గదర్శిగా పూజింపబడతాడు అంటారు. ఈ పండగ ప్రజలను సకల జనులను ఒకతన చేర్చి సామరస్యాన్ని సాంప్రదాయాలను ప్రజల్లో పెంపొందిస్తుంది. అయితే పాతకాల పురాణాల ప్రకారం వినాయకుడు తన భక్తులను ఆశీర్వదించడానికి భూమిని సందర్శిస్తాడనే నమ్మకం.
శివపురాణం ప్రకారం పార్వతి దేవి స్వయంగా ఒక బిడ్డను కనాలని కోరికతో మట్టితో వినాయకుడిని తయారు చేసింద అని మనకు పురాణాల ద్వారా తెలుస్తున్నది. ఆరోజు వినాయకుని పుట్టినరోజుగా ఈ పండుగను జరుపుకుంటారని ఏవైనా కొత్త పనులను ప్రారంభించే ముందు కూడా వినాయకుడుని పూజిస్తారని వేదాలు ఉపనిషత్తులు పురాణాలు చెబుతున్నాయి.
వినాయక నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో వినాయక చవితి భక్తులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు ఇతరులు తదితరులు పాల్గొన్నారు.