వికారాబాద్ కామారెడ్డి గూడెంలో స్వాతి కుటుంబాన్ని పరామర్శించిన, ఎమ్మెల్సీ, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న, అధైర్య పడద్దని కుటుంబ సభ్యులకు భరోసా,

పరామర్శ ,

K, Yadaiah/ August/29,2025,

వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి కుటుంబ సభ్యులను శుక్రవారం రోజు ఎమ్మెల్సీ క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న పరామర్శించారు…..

వికారాబాద్ జిల్లా :ఇటీవల హైదరాబాద్ లో హత్యకు గురైన వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన వివాహాయిత, స్వాతి కుటుంబాన్ని ఎమ్మెల్సీ క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న పరామర్శించారు.

శుక్రవారం రోజు వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడ లోని స్వాతి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు తీన్మార్ మల్లన్న. హత్య జరిగిన వివరాలు స్వాతి కుటుంబ నేపథ్యం వారి కష్టసుఖాలను స్వాతి తల్లిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ధైర్యంగా ఉండాలని అధైర్య పడద్దని తీన్మార్ మల్లన్న స్వాతి కుటుంబ సభ్యులకు భరోసమిచ్చారు.

Exit mobile version